Weather Report : ప్రస్తుతం భారత దేశంలో శీతాకాలం. కానీ, వాతావరణ ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా ఉంది. ఉత్తర బారతంలో చలి ప్రభావం కొనసాగుతోంది. కానీ దక్షిణ భారతం వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో శీతాకాలంలో ఎండపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఈసారి ఎండలు బాగా ఉండేలా కనిపిస్తున్నాయి. జనరిలోనే ఇలా ఉంటే.. మార్చి నాటికి మాడు పగులుతుందని ఆందోళన చెందుతున్నారు.
ద్రోణి ప్రభావంతో..
దక్షిణాది రాష్ట్రాలపై ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో జనవరి 31న తమిళనాడు, పుదుచ్చేరిలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ ద్రోణి ప్రభావంతోనే ఏపీ, తెలంగాణ వేడెక్కుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం.. ఇవాళ తెలుగు రాష్ట్రాలపై తేలికపాటి మేగాలు వస్తూ పోతుంటాయి. అయినా వేడి ఎక్కువగా ఉంటుంది. ఎండలో ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐంఎడీ సూచించింది. మరోవైపు ద్రోణి కారణంగా బంగాళాఖాతంలో గాలి వేగం బాగా తగ్గింది. గంటకు 15 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఏపీలో గాలివేగం గంటకు 11 కిలోమీటర్లు ఉండగా, తెలంగాణలో కేవలం గంటకు 7 కిలోమీటర్లు మాత్రమే ఉంది. గాలి వేగంగా లేకపోవడం కూడా వేడికి కారణమని పేర్కొంటున్నారు.
32 డిగ్రీలకుపైగానే..
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో జనవరి 31 సగటు ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఏపీలో 33 డిగ్రీలు దాటింది. క్రమంగా ఫ్యాన్లూ, ఏసీలు వాడాల్సి వస్తోంది రాత్రివేల కూడా చలి తగ్గుతోంది. తెలంగాణలో 19 డిగ్రీలు దాటింది. ఏపీలో 22 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం బాగా తగ్గిపోయింది. పగటివేళ తెలంగాణలో 40 శాతం ఉంటే.. ఏపీలో 35 శాతమే ఉంది. రాత్రివేళ తెలంగాణలో 80 శాతం ఉంటే.. ఏపీలో 98 శాతం ఉంది. రాత్రివేళ రెండు రాష్ట్రాల్లో కొంత చలి ఉంటుంది. తెల్లవారుజామున మంచు కురుస్తుంది. మొత్తంగా వాతావరణం బాగుంది.