Suriya
Suriya : సౌత్ స్టేట్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే మనకి సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత గుర్తుకొచ్చే పేరు సూర్య. ఒకప్పుడు ఈయన సినిమాలకు రజినీకాంత్ తో సమానంగా ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. అజిత్, విజయ్ వంటి వారు దరిదాపుల్లో కూడా ఉండేవారు కాదు. కానీ ప్రయోగాల జోలికి వెళ్లి వరుసగా చేతులు కాల్చుకుంటూ తాను సంపాదించుకున్న మార్కెట్ మొత్తాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాడు సూర్య. ఆయన నుండి ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి దశాబ్దం దాటింది. మూడేళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి, ఆయన చేసిన ‘కంగువా’ చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎలాంటి డిజాస్టర్ గా మిగిలిందో మన అందరికీ తెలిసిందే. సూర్య కి భారీ కం బ్యాక్ అయ్యే చిత్రంగా నిలుస్తుంది అనుకుంటే, ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ గా మిగిలింది.
ఈ సినిమా తర్వాత సూర్యలో చాలా మార్పులు వచ్చాయి. ఇక నుండి ఆయన తమిళ డైరెక్టర్స్ తో కాకుండా, తెలుగు డైరెక్టర్స్ తోనే ఎక్కువగా సినిమాలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నాడు. తమిళం నుండి తెలుగులోకి వచ్చి ధనుష్ ‘సార్’ వంటి సూపర్ హిట్ చిత్రం తో మన ఆడియన్స్ కి ఎంత దగ్గరయ్యాడో మనమంతా చూసాము. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ‘కుభేర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అదే విధంగా మలయాళం నుండి తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాలతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని తెలుగు యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇలా ఇతర భాషలకు సంబంధించిన హీరోలు తెలుగులో వరుసగా సినిమాలు చేసి హిట్స్ అందుకోవడాన్ని గమనించిన సూర్య, ఆయన కూడా అదే రూట్ లో నడవడానికి సిద్దమయ్యాడు.
త్వరలోనే ఆయన తండేల్ చిత్ర దర్శకుడు చందు మొండేటి తో ఒక సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే సూర్య ని కలిసి రెండు స్టోరీలు వినిపించానని, వాటిలో ఎదో ఒకటి ఫైనల్ అవ్వబోతుందని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అదే విధంగా ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి తో సూర్య త్వరలోనే ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించబోతున్నాడు. ఈ చిత్రం తో పాటు బోయపాటి శ్రీను తో గీత ఆర్ట్స్ బ్యానర్ పై మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ‘అఖండ 2 ‘ తర్వాత బోయపాటి చేయబోయే సినిమా ఇదే. ప్రస్తుతం సూర్య కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో ‘రెట్రో’ అనే చిత్రం చేసాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.