Revanth Reddy Padayatra: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రపై క్లారిటీ వచ్చింది. మరో నాలుగు రోజుల్లో యాత్ర మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం.. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే ఈ యాత్ర లక్ష్యమని రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే అంతర్గత గొడవలతో ఇప్పటికే సీనియర్లు రేవంత్‌కు మద్దతు ఇవ్వడం లేదు. ఈ తరుణంలో పాదయాత్ర మొదలు పెడితే ఆయనతో చేయి కలిపేదు ఎవరు.. చేయి ఇచ్చేది ఎవర్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

– 6 నుంచి షురూ..
ఫిబ్రవరి 6 నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం మేడారం నుంచి యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. మొదటి విడతలో 60 రోజులు పాటు యాత్ర సాగుతుందని వెల్లడించారు. ఇందులో దాదాపు 50 నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. మొదట విడత పాదయాత్ర పూర్తయిన తరువాత రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
– జాతీయ నాయకుల హాజరు..
పాదయాత్రలో భాగంగా వివిధ సందర్భాల్లో పార్టీకి చెందిన జాతీయ నాయకులు హాజరవుతారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్‌రెడ్డి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఈనెల 6 నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే మొదటి విడత రేవంత్ రెడ్డి ఏయే నియోజకవర్గాలను టచ్ చేస్తారు ? అక్కడ కాంగ్రెస్ నేతలు, శ్రేణుల నుంచి ఆయనకు ఏ రకమైన స్పందన లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జాతీయ నాయకులు ఎవరెవరు వస్తారనే విషయంలో క్లారిటీ లేదు.
కలిసి నడుస్తారా..?

రేవంత్‌రెడ్డిపై పదిమంది సీనియర్లు మూడు నెలల క్రితం తిరుటుబాటు ప్రారంభించారు. తామే అసలైన కాంగ్రెస్ వాదులమంటున్నారు. తెలంగాణ ఇన్‌చార్జిని, పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని పట్టుపట్టారు. అయితే అధిష్టానం ఇన్‌చార్జిని మార్చింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని కొనసాగించేదుకే మొగ్గు చూపింది. అధిష్టానం అండతో రేవంత్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. కలహాల కాంగ్రెస్‌లో సీనియర్ల తిరుగుబాటు నేపథ్యంలో రేవంత్‌తో కలిసి నడిచేదెవరన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.