Homeఎంటర్టైన్మెంట్Visakhapatnam AP Capital: విశాఖే రాజధాని: కేసు కోర్టులో ఉండగా జగన్ లో ఎక్కడిది...

Visakhapatnam AP Capital: విశాఖే రాజధాని: కేసు కోర్టులో ఉండగా జగన్ లో ఎక్కడిది ఈ ధైర్యం?

Visakhapatnam AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చారు.. విశాఖపట్నమే క్యాపిటల్ సిటీ అని తేల్చి చెప్పారు.. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి చర్చ మొదలైంది.. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించారు.. ఐదేళ్లు కూడా సింగపూర్ డిజైన్లతో పొద్దుపొచ్చారు.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో కర్కశంగా ఉన్నారు.. మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు.. దీనిపై విపక్ష నేతలు కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పలేదు.. అయినప్పటికీ బెట్టు వీడని జగన్ విశాఖపట్నం ప్రాంతాన్ని రాజధానిగా తెరపైకి తీసుకొచ్చారు.. అంతేకాదు ఇటీవల అదే విషయాన్ని తేల్చి చెప్పారు.

Visakhapatnam AP Capital
Visakhapatnam AP Capital

మూడు రాజధానుల కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే విశాఖ పట్నం రాజధాని అవుతుందని, తాను కూడా త్వరలో అక్కడికే తరలి వెళ్తానని జగన్ ఢిల్లీలో ఒక కీలక సమావేశంలో కామెంట్ చేయడం ఇప్పుడు రాష్ట్రంలో దుమారం లేపుతోంది.. ఒక కేసు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, మరో కోర్టులో కావచ్చు… విచారణ లో దానికి సంబంధించి ఎలాంటి కామెంట్లు కూడా చేయకూడదు.. ఇది అందరికీ తెలిసిందే… మరి అలాంటప్పుడు జగన్ ఎందుకు ఈ కామెంట్ చేసినట్టు?

ఇదివరకే ఇదే కేసు హైకోర్టులో ఉన్నప్పుడు కూడా మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.. కానీ సీఎం సీట్లో ఉన్న జగన్ మాట్లాడాలి కాబట్టి పెద్ద దుమారం చెలరేగుతుంది.. మంగళవారం జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాక సదస్సులో త్వరలోనే విశాఖ ఏపీ రాజధాని కాబోతుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రదుమారం రేపుతున్నాయి.. ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉండగా… సీఎం హోదాలో ఉండి జగన్ రాజధాని గురించి మాట్లాడటం సరికాదంటూ ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీ య జనతా పార్టీ, జనసేన నాయకులు విరుచుకు పడుతున్నారు.

Visakhapatnam AP Capital
Visakhapatnam AP Capital

ఈ క్రమంలో సీఎం జగన్ సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు ఊహించని షాక్ ఇచ్చారు.. పి రాజధాని విశాఖ అంటూ ప్రకటన చేసి సీఎం జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని భారత చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ కు లేఖ రాశారు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణ వేళ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని… నిబంధనల ప్రకారం జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని లేఖలో ఆరోపించారు.. న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని… జగన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామరాజు లేఖలో కోరారు.. కాగా సీఎం జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం వైసిపిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. కోర్టులో తీర్పు రాకుండా ఎలా రాజధాని మార్చగలరని మరికొందరు ప్రశ్నిస్తున్నారు..

అయితే ముఖ్యమంత్రి జగన్ కు ఇవేవీ తెలియనివి కావు.. ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు గతంలోనే చెప్పింది.. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు.. ప్రస్తుతం రాజధాని అమరావతి మాత్రమే.. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో ఉంది.. అత్యంత క్లిష్టమైన కేసుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు.. ఇక్కడ ప్రభుత్వం అనుకోగానే రాజధాని మార్పు చేయలేరు.. ఎందుకంటే రాజధాని పేరుతో 29 వేల మంది నుంచి ప్రభుత్వం భూములు సమీకరణ చేసింది.. వారికి అనేక వాగ్దానాలు చేసింది.. అవి నెరవేర్చకపోతే నష్టపరిహారం ఇస్తామని ఒప్పందం చేసుకుంది.. రాజధాని మార్చాలంటే ప్రభుత్వం ఈ సమస్యలను అధిగమించాలి..

ఇక దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది.. తీర్పు వచ్చిన తర్వాతనే రాజధానిని మార్చగలరా లేదా అన్నది తేలుతుంది.. కానీ జగన్ మాత్రం సుప్రీంకోర్టు విచారణ పరిగణలోకి తీసుకోవడం లేదన్నట్టుగా ప్రకటించడం సంచలనంగా మారింది.. రాజధాని అంశంపై విస్తృతంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.. ఇటీవల కాలంలో ఏపీలో రాజధాని అంశం పూర్తిగా చల్లబడిపోయింది.. రాజధాని రైతులు పాదయాత్ర విరమించారు.. అధికార పార్టీ నాయకులు కూడా మూడు రాజధానుల ఉద్యమం చేయడం లేదు.. ఈ క్రమంలో మరోసారి రాజధాని అంశం చర్చకు రావడం రాజకీయంగా అవసరం అన్న ఉద్దేశంతోనే ఈ కామెంట్లను వ్యూహాత్మకంగా ఢిల్లీలో చేశారని అంటున్నారు.. జాతీయస్థాయిలో ఫోకస్ అయ్యేందుకే ఈ ప్రకటన చేశారని… అదే రాష్ట్రంలో చేసి ఉంటే రాష్ట్రంలో మాత్రమే చర్చనీయాంశం అయ్యేదాని అంటున్నారు..

పెట్టుబడిదారుల్లో ఉన్న మూడు రాజధానుల డైలమాను జగన్ తీర్చే ప్రయత్నం చేశారని అంటున్నారు.. సీఎం ఎక్కడి నుంచి పరిపాలించాలనేది ఆయన ఇష్టమని పలుమార్లు అధికార పార్టీ నాయకులు ప్రకటించారు.. ఆ సిద్ధాంతం ప్రకారం సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖలో ఏర్పాటు చేసుకోవచ్చు.. దీనిని కోర్టులు అడ్డుకోలేవు.. కానీ శాఖలు మాత్రం మార్చలేరు. అమరావతిని రాజకీయంగా రాజధానిగా ఉంటుందని అధికార పార్టీ నాయకులు అంతర్గతంగా అంటున్నారు.. విశాఖ నుంచి జగన్ పరిపాలన చేసుకోవచ్చని,కానీ అది రాజధాని కాదని పేర్కొంటున్నారు. న్యాయపరంగా అన్ని చిక్కులు పరిష్కరించుకున్న తర్వాతే మరో బిల్లు పెట్టి ఆమోదించుకున్న తర్వాతనే మూడు రాజధానులు లేదా విశాఖ రాజధాని అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular