https://oktelugu.com/

Bryan Johnson: వయసేమో 46.. డబ్బులు బాగా ఉన్నాయి.. పాతికేళ్ల యువకుడిలా మారాలని ప్రయత్నించాడు.. చివరికిలా..

అతని పేరు బ్రయాన్ జాన్సన్. అమెరికాలో ఉంటాడు.. వ్యాపారాలు చేస్తుంటాడు. దండిగా డబ్బు ఉంది. అతని వయసు 46 సంవత్సరాలు. ఇంత వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలాగా కనిపించాలని భావించాడు. కానీ అది అడ్డం తన్నింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 20, 2024 10:14 am
Bryan Johnson

Bryan Johnson

Follow us on

Bryan Johnson: బ్రయాన్ గత కొన్ని సంవత్సరాలుగా తన వయసు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. వయసు పైబడుతున్నా.. పాతిక సంవత్సరాల కుర్రాడి లాగా కనిపించడానికి అనేక పద్ధతులను పాటిస్తున్నాడు. దీనికోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటున్నాడు. ప్రత్యేకంగా నిర్మించిన ఇంట్లో నివసిస్తున్నాడు. దీనికోసం కఠినమైన పద్ధతులను అవలంబిస్తున్నాడు. ఈ యాంటీ ఏజింగ్ థెరపీ కోసం అతడు భారీగా ఖర్చు చేస్తున్నాడు. అయితే ఈ క్రతువులో అతడు చేస్తున్న విధానం ఒక్కసారిగా దెబ్బ కొట్టింది. దీంతో అతని ముఖం మారిపోయింది. బ్రయాన్ తన యాంటీ ఏజింగ్ ప్రక్రియలో భాగంగా ఒక దాత ఇచ్చిన ఫ్యాట్ (వైద్య పరిభాషలో ఒక రకమైన కొవ్వు) ను తన ముఖం మీద ఇంజెక్ట్ చేసుకున్నాడు. దీంతో అతడి ముఖం ఒక్కసారిగా వాచిపోయింది. ఫలితంగా అది అతడి అందం మీద ప్రభావం చూపించింది.. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

వందల కోట్లు ఖర్చు

యాంటీ ఏజింగ్ థెరపీ కోసం బ్రయాన్ ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేశాడు. కేవలం అతడు ఉండే నివాసంలో పూర్తిగా ఆక్సిజన్ ఛాంబర్లు ఏర్పాటు చేసుకున్నాడు.. పొరపాటున కూడా కొవ్వు పదార్థాలు తినడు. ఖనిజలవణాలు లేని నీటిని తాగడు. కేలరీలు లెక్క వేసుకుని ఆహారం తింటాడు. పొల్యూషన్ వాతావరణంలోకి వెళ్లడు. కార్యాలయంలో పనిచేసే సమయంలో చుట్టూ ఎవరూ లేకుండా చూసుకుంటాడు. తన గదిలోకి ఇతర వ్యక్తులను రానివ్వడు. అంతేకాదు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటాడు. తన థెరపీలో భాగంగా ప్రత్యేకమైన ల్యాబ్ ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. వైద్యులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లేదా జూమ్ కాల్స్ లో అందుబాటులో ఉంటాడు. ఫోన్ కూడా ఎక్కువగా యూస్ చేయడు. అందువల్లే బ్రయాన్ అందంగా ఉంటాడు. 50 సంవత్సరాల వయసుకు దగ్గరగా ఉన్నప్పటికీ.. పాతిక సంవత్సరాల యువకుడిలాగే కనిపిస్తాడు. అయితే బ్రయాన్ చేస్తున్న ప్రయోగాలను కొంతమంది తేలికగా తీసుకున్నారు. మరి కొంతమంది పిచ్చిపనిగా అభివర్ణించారు. ఇంకొందరైతే బుర్ర పాడైందని పేర్కొన్నారు. ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా బ్రయాన్ తను చేస్తున్న పనిని మాత్రం ఆపడం లేదు. ప్రయోగాలను నిలువరించడం లేదు. పైగా ఫ్యాట్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల తన ఫేస్ వాచిపోవడాన్ని.. బ్రయాన్ గొప్పగా అభివర్ణించుకున్నాడు.. ఒక ప్రోడక్ట్ ను తయారు చేయడం కంటే.. మనమే దానికి ప్రొడక్ట్ ఉండడం వేరువేరు విషయాలని అతడు పేర్కొన్నాడు. ఐతే బ్రయాన్ ఇంత కష్టపడి తన వయసును తగ్గించినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం పొందుతాడు అర్థం కావడం లేదని కొంతమంది సైకాలజిస్టులు పేర్కొంటున్నారు..ఇది సరైన పద్ధతి కాదని వివరిస్తున్నారు.