AR Rahman: ఏఆర్ రెహమాన్ – సైరా భాను తీసుకున్న నిర్ణయం కేవలం తమిళ చిత్ర పరిశ్రమనే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమనే షాక్ కు గురి చేసింది. ఎందుకంటే సైరా భాను – రెహమాన్ అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడు కూడా వీరి కాపురంలో కలహాలు రాలేదని సన్నిహితులు అంటున్నారు. ఆ మధ్య స్లం డాగ్ మిలియనీర్ సినిమాలో జయహో పాటకు రెహమాన్ ఆస్కార్ అవార్డు దక్కించుకున్నారు. ఆ సందర్భంలో తన భార్య వల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు.. అలాంటి వ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకోవడం నిజంగానే సంచలనం కలిగిస్తోంది. ఇటీవల రెహమాన్ మేనల్లుడు, ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ కూడా తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అతడిది కూడా ప్రేమ వివాహం. వారిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. కొన్నాళ్లపాటు సాఫీగా సాగిన వారి సంసారంలో కలహాలు మొదలు కావడంతో.. ఇకపై కలిసి ఉండడం సాధ్యం కాదని భావించి విడాకులు తీసుకున్నారు.
అందువల్లేనా..
రెహమాన్ వృత్తి గత జీవితంలో ఎటువంటి ఆరోపణలు లేవు. వ్యక్తిగత జీవితంలోనూ ఎటువంటి విమర్శలు లేవు. అయితే కొంతకాలంగా రెహమాన్ వ్యవహరిస్తున్న తీరు సైరా భాను కు నచ్చడం లేదట. ఇదే విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో రెహమాన్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందట. కొంతమంది పెద్దలు రంగ ప్రవేశం చేసి వివాదాన్ని సర్దుమణిగించేందుకు ప్రయత్నాలు చేశారట. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందట. దీంతో ఒడిదుడుకుల మధ్య సంసారాన్ని సాగించలేమని భావించి విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారట. అగాధం అంతకంతకు పెరిగిపోవడంతో ఇక తట్టుకోలేక భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారట. ” ఇది కష్టకాలం. కానీ తప్పడం లేదు. కొన్నిసార్లు కలిసి ప్రయాణ సాగించడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఎవరిదారులు వారు చూసుకోవడమే మంచిది. ప్రస్తుతం మేము విడాకులు తీసుకున్నాం. దీనికి సంబంధించిన వ్యవహారం మా ఇద్దరి వ్యక్తిగతం. ఇలాంటి సమయంలో మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి. మా ప్రైవసీకి భంగం కలగకుండా చూడండని” రెహమాన్, సైరా భాను కోరారు. సైరా భాను, రెహమాన్ కు ముగ్గురు పిల్లలు. రెహమాన్ జన్మతా హిందువు అయినప్పటికీ.. తన కుటుంబంలో ఎదురైన సమస్యను అల్లాకు మొక్కితే తీర్చడాని భావించి.. ఆయన ముస్లిం మతాన్ని స్వీకరించారు. నాటి నుంచి తన పేరును రెహమాన్ గా మార్చుకున్నారు. స్లం డాగ్ మిలియన్ సినిమాలో జయహో పాటకు ఆయన ఆస్కార్ అవార్డు దక్కించుకున్నారు. అంతకుముందు రెహమాన్ అద్భుతమైన సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాల్లో జెంటిల్మెన్, జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, రోజా, బొంబాయి, దళపతి, ఓకే బంగారం, శివాజీ, బాయ్స్ చిత్రాలు మాస్టర్ పీస్ లు గా నిలిచాయి.