Killi Paul: ఇంటర్నెట్ సంచలనం కిలి పాల్ కు భారత హైకమిషన్ అరుదైన గౌరవం

Killi Paul: ఎక్కడో ఆఫ్రికా దేశం టాంజానియాలో మన భారతీయ సినిమాల పాటలకు డ్యాన్సులు వేస్తూ పాపులర్ అయ్యాడు కిలీ పాల్. సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి కిలీపాల్ ఎవరో ఈజీగా తెలుసు. ఆఫ్రికా పేద దేశంలోని ఈ డ్యాన్సర్ బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు లిప్ సింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు. ఇంటర్నెట్ లో కిలీపాల్ ఇప్పుడొక సెన్సేషన్ అని చెప్పాలి. ఇప్పుడు కిలీ పాల్ […]

Written By: NARESH, Updated On : February 23, 2022 4:08 pm
Follow us on

Killi Paul: ఎక్కడో ఆఫ్రికా దేశం టాంజానియాలో మన భారతీయ సినిమాల పాటలకు డ్యాన్సులు వేస్తూ పాపులర్ అయ్యాడు కిలీ పాల్. సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి కిలీపాల్ ఎవరో ఈజీగా తెలుసు. ఆఫ్రికా పేద దేశంలోని ఈ డ్యాన్సర్ బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు లిప్ సింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు. ఇంటర్నెట్ లో కిలీపాల్ ఇప్పుడొక సెన్సేషన్ అని చెప్పాలి.

Killi Paul

ఇప్పుడు కిలీ పాల్ కు అరుదైన గౌరవం దక్కింది. పాల్ ను ఆ దేశంలోని భారత హైకమిషన్ సత్కరించింది. టాంజానియాలోని భారత హైకమిషన్ కార్యాలయంలో కిలీ పాల్ ను సంత్కరించిన సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను భారత దౌత్యవేత్త బినయ ప్రధాన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అవిప్పుడు వైరల్ అయ్యాయి.

ప్రముఖ టాంజానియా కళాకారుడు కిలీపాల్ ప్రముఖ భారతీయసినిమా పాటలకు డ్యాన్స్ చేస్తే తన వీడియోలతో భారత దేశంలోని మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నారు అని టాంజానియాలోని భారత హైకమిషనర్ బినయా ప్రధాన్ ఫిబ్రవరి 21న ట్వీట్ చేశారు.

Also Read: బడ్జెట్ లేదు.. గిడ్జెట్ లేదు.. 94 వేల కోట్లు ఏమైపోయాయబ్బా?

ఇన్ స్టాగ్రామ్ లో 2.2 మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగిన కిలీ పాల్ తన డ్యాన్సులు, నటనతో భారతీయుల మనసులు గెలిచాడు. కిలీ పాల్, అతడి సోదరి నీమా పాల్ తరుచుగా ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు రీల్స్ వీడియోలు చేసి షేర్ చేస్తుంటారు. ఈ అన్నాచెల్లెల్లు ఇప్పుడు భారత దేశంలో ఎంతో ఫేమస్.వారి డ్యాన్స్ ను బాలీవుడ్ నటులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సహా చాలా మంది నెటిజన్లు, ప్రముఖులు కూడా అభినందించారు.

పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మా.. ’ అనే వీడియోను చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. లక్షల్లో లైకులు వచ్చాయి. ఇన్ స్టాలో అతడి భారతీయుల నుంచి ఫాలోయింగ్ బాగా పెరిగింది.

Also Read: కొత్త జిల్లాలపై వివాదాలు ముగిసేనా? ఎన్టీఆర్ పేరు ఉంచుతారా? అభ్యంతరాలివీ?

Recommended Video: