https://oktelugu.com/

Bheemla Nayak Trailer Records: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ ట్రైలర్.. ఒక్కరోజులో ఇన్ని వ్యూసా?

Bheemla Nayak Trailer Records: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలిసి వచ్చింది. పవన్, రానా హీరోలుగా నటిస్తున్న ‘భీమ్లానాయక్’ మూవీ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఒక్కరోజులోనే దడదడ లాడించింది. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి ట్రైలర్ల రికార్డులను బద్దలు కొట్టింది. దూసుకెళుతూ ప్రత్యర్థులకు అందనంతగా దూసుకెళుతోంది. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. స్టార్ డైరెక్టర్ తివిక్రమ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2022 / 10:16 AM IST
    Follow us on

    Bheemla Nayak Trailer Records: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలిసి వచ్చింది. పవన్, రానా హీరోలుగా నటిస్తున్న ‘భీమ్లానాయక్’ మూవీ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఒక్కరోజులోనే దడదడ లాడించింది. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి ట్రైలర్ల రికార్డులను బద్దలు కొట్టింది. దూసుకెళుతూ ప్రత్యర్థులకు అందనంతగా దూసుకెళుతోంది.

    Bheemla Nayak Trailer

    సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. స్టార్ డైరెక్టర్ తివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ మూవీని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

    Also Read:  జగ్గారెడ్డి, వీహెచ్ లో రేవంత్ పంచాయితీ ఏంటి?

    ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ యూట్యూబ్ లో చరిత్ర సృష్టిస్తోంది. ఫాలోవర్స్, ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడంతో దీని వ్యూస్ దూసుకుపోతున్నాయి. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

    Bheemla Nayak

    సినిమా ట్రైలర్ విడుదలైన గంటలోనే 1.2 మిలియన్ వ్యూస్ రాబట్టి సత్తా చాటింది. ఇక లైక్స్ పరంగా 6.2 లక్షల లైక్స్ వచ్చింది. ఇదే స్పీడు కొనసాగితే ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ వ్యూస్ పరంగా సంచలనం సృష్టిస్తోంది.ఈ ఊపు చూస్తుంటే ఇది ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా అంటున్నారు

    ట్రైలర్ విడుదలయ్యాక ‘భీమ్లానాయక్’ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈరోజు జరుగబోతోంది. ఏపీ మంత్రి గౌతం రెడ్డి మరణంతో ఈ ప్రి రిలీజ్ వేడుక వాయిదా పడింది.

    భీమ్లా నాయక్ ట్రైలర్ ఒక్కరోజులోనే ఏకంగా 12 మిలియన్ల వ్యూస్ దాటి యూట్యూబ్ ను దద్దరిల్లేలా చేస్తోంది. ఇది టాలీవుడ్ చరిత్రలోనే ఒక రికార్డుగా చెబుతున్నారు. 23న ఉదయం 9 గంటల వరకే 13 మిలియన్లకు ఇది చేరువైంది. ఈ ఊపు చూస్తుంటే సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది.

    Also Read: మనం ఉచితంగా ఉపయోగించే వాట్స్ అప్ కి డబ్బులు ఎలా వస్తాయో తెలుసా ?

    Recommended Video:

    Tags