Tamil Nadu: తన ఆవును చంపిందని.. పులులపై పగ తీర్చుకున్నాడు

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాకు చెందిన శేఖర్ అనే రైతుకు కొంత పొలం ఉంది. అతడికి వంశపారంపర్యంగా వచ్చిన పశువులు కూడా ఉన్నాయి. ఆ పశువుల్లో ఆవుల సంఖ్య ఎక్కువ.

Written By: Bhaskar, Updated On : September 21, 2023 3:37 pm

Tamil Nadu

Follow us on

Tamil Nadu: రైతులకు, పశువులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. తమ పిల్లల కంటే ఎక్కువ పశువులను రైతులు సాదుకుంటారు. వాటికి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేరు. అవి మేత మోయకపోయినా, నీళ్లు సరిగా తాగకపోయినా, వాటికి ఇంకా ఏమైనా అస్సలు సహించలేరు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఓ రైతు తాను పెంచుకుంటున్న పశువును రెండు పులులు చంపి తినేశాయి. దీంతో అతడు వాటిపై ఎలా పగ సాధించుకున్నాడో తెలిస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురికాక మానదు.

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాకు చెందిన శేఖర్ అనే రైతుకు కొంత పొలం ఉంది. అతడికి వంశపారంపర్యంగా వచ్చిన పశువులు కూడా ఉన్నాయి. ఆ పశువుల్లో ఆవుల సంఖ్య ఎక్కువ. ఆవుల పాలు అమ్ముకుంటూ అతడు జీవనం కొనసాగిస్తున్నాడు. ఆ ఆవులను స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్తాడు. అయితే ఒకరోజు మేతకు తీసుకెళ్లిన అనంతరం ఒక ఆవు ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన శేఖర్ ఆవు కోసం అటవీ ప్రాంతం మొత్తం వెతికాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

ఆరోజు రాత్రి ఇంటికి వచ్చినప్పటికీ ఆవు కనిపించలేదనే ఆవేదన అతనిలో గూడుకట్టుకుపోయింది. మరుసటి రోజు ఉదయమే అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఆవు కోసం గాలిస్తుండగా అతడి గుండె చెరువయ్యే దృశ్యం కనిపించింది. ఎంతగానో తాను ప్రేమగా సాకుతున్నావు విగత జీవిగా పడి ఉంది. పైగా సగం ఆవును జంతువులు తిన్నాయి. అంత పెద్ద ఆవును పులులే తిన్నాయని భావించిన శేఖర్.. కసితో రగిలిపోయాడు. వెంటనే ఆ పులులను చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే పులులను చంపాలంటే అంత సులభం కాదు కాబట్టి దానికోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు.. ఆవు సగం మృతదేహంపై పురుగుల మందు పూశాడు. పులులు ఎక్కడైతే మృతదేహాన్ని వదిలేశాయి అక్కడే పెట్టాడు. ఆవులు సగం చంపితిన్న పులులు మరుసటి రోజు అక్కడికే వచ్చాయి. మిగతా మృతదేహాన్ని ఆరగించాయి. పురుగుల మందు పూయడంతో అవి చనిపోయాయి. వాటి కళేబరాలు ఆ అటవీ ప్రాంతంలో ఉన్న వాగులో కనిపించాయి. అవి అధికారుల పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పులుల మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి అనంతరం ఖననం చేశారు. ఆ పోస్టుమార్టం నివేదికలో పులులు పురుల మందు పూసిన మాంసం తినడం వల్ల చనిపోయాయని నిర్ధారణ అయింది. ఇక జిల్లాలో అటవీశాఖ అధికారులు విచారణ నిర్వహించగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీంతో శేఖర్ ను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు అతడిని విచారించడం మొదలుపెట్టారు. తన ఆవును పులులు చంపితిన్నాయని.. అందుకే వాటిపై పగ తీర్చుకున్నారని శేఖర్ గర్వంగా చెప్పడం ఇక్కడ విశేషం. బాగా ప్రస్తుతం ఈ శేఖర్ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.