https://oktelugu.com/

Manchu Lakshmi: అడ్డొచ్చాడని ఒక్కటి పీకింది.. నాన్న ఏక్ నంబర్.. మంచు లక్ష్మీ దస్ నంబర్..

ఈ నేపథ్యంలో మోహన్ బాబు వారసత్వాన్ని పునికి పుచ్చుకుంది అనే పేరు ఉన్న మంచు లక్ష్మి.. ప్రస్తుతం చేసిన ఒక పని కూడా తన తండ్రిలానే కొంచెం అతిగా ఉంది అంటూ సోషల్ మీడియా లో ఒక వీడియో షేర్ చేసి మరి కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 21, 2023 / 04:28 PM IST

    Manchu Lakshmi

    Follow us on

    Manchu Lakshmi: నటన పరంగా తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. కాగా వారికి ఆ పేరు తెచ్చింది ఎలాంటి పాత్రనైనా చేయగలిగే మోహన్ బాబు. అయితే నటన పరంగా ఈ ఫ్యామిలీకి ఎంత మంచి పేరు ఉందో.. వారి ప్రవర్తన పరంగా కొంచెం తేడా పేరు కూడా ఉంది. కాగా ఇందుకు కారణం కూడా ఏ విషయానికి అయినా ఎక్కువగా రియాక్ట్ అయ్యే మోహన్ బాబునే.

    ఈ నేపథ్యంలో మోహన్ బాబు వారసత్వాన్ని పునికి పుచ్చుకుంది అనే పేరు ఉన్న మంచు లక్ష్మి.. ప్రస్తుతం చేసిన ఒక పని కూడా తన తండ్రిలానే కొంచెం అతిగా ఉంది అంటూ సోషల్ మీడియా లో ఒక వీడియో షేర్ చేసి మరి కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.

    అసలు విషయానికి వస్తే ఆమె ఇటీవలే దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. దక్షిణాది నటీనటులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సైమా అవార్డ్స్- 2023 ఈవెంట్‌ దుబాయ్‌లో నిర్వహించారు. సెప్టెంబర్ 15-16 తేదీలలో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లకు సినీ ప్రముఖులందరూ పాల్గొన్నారు.

    ఇక ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న మంచు లక్ష్మికి ఓ వ్యక్తి చేసిన పని కోపం తెప్పించింది. కాగా ఆ వ్యక్తి ఏమి పెద్ద తప్పు చేయలేదు ఆ వ్యక్తి చేసిందల్లా లక్ష్మీ మాట్లాడుతున్నప్పుడు కెమెరాకు అడ్డురావడం.
    వేదికపైనే మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మంచు లక్ష్మి మీడియా తో మాట్లాడుతూ ఉండగా.. ఓ వ్యక్తి అడ్డు వచ్చాడు. అడ్డు వచ్చిన ఆ వ్యక్తి మీద ఓ దెబ్బ వేసింది. నీ.. అంటూ ఏదో అనబోయింది. సదరు యాంకర్ ఆ వీడియోను తీసేయండి, కట్ చేయండని అంటే.. వద్దు ఉంచండి అని మంచు లక్ష్మీ అనేసింది.

    ఆ తర్వాత మరో వ్యక్తి అక్కడికి రావడంతో కెమెరా వెనకకు వెళ్లండి డ్యూడ్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

    ఇక ఇది చూసిన కొందరు నెటిజన్స్ సమర్థించగా.. మరికొందరేమో తప్పుపడుతున్నారు. చాలామంది మాత్రం మంచు లక్ష్మి వాళ్ళ నాన్న కన్నా పది ఆకులు ఎక్కువే చదివింది ..మోహన్ బాబు ఒక పది శాతం అతి చేస్తే మంచు లక్ష్మీ దానికి మరో 10% ఎక్కువ చేస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.