Chain Snatching Lovers: వారు బీటెక్ విద్యార్థులు. సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు ఎంచుకున్నారు. దొంగతనం ఎప్పటికి దాగదు. ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోవడం ఖాయం. చివరకు కటకటాలు లెక్కపెట్టడం కూడా జరుగుతుంది. కానీ విలాసవంతంగా బతికేందుకు వీరు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు. జీవితంలో బాగా బతకాలంటే కష్టపడి పనిచేయాలనే చిన్న లాజిక్ ను మిస్సయ్యారు. ఫలితంగా ఊచలు లెక్కిస్తున్నారు చోరీ చేయడం అంత సులువు కాదు. దానికి స్కెచ్ ఉండాలి. తప్పించుకోగలగాలి. వీరు మాత్రం తొందరగానే పోలీసులకు చిక్కి జైలు జీవితం గడుపుతున్నారు.
తమిళనాడు రాష్ర్టం కోయంబత్తూరుకు చెందిన ప్రసాద్, తేజస్విని ప్రేమికులు వీరు విద్యార్థులు కావడంతో డబ్బు సర్దుబాటు కష్టంగా మారింది. దీంతో ఇద్దరు చైన్ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా బాగా ప్రిపేర్ అయ్యారు. ఇక రంగంలోకి దిగి చోరీలు ప్రారంభించారు. తొండముత్తూర్ కు చెందిన ఓ మహిళ చేనులో ఏప్రిల్ 28న మేకను మేపుతోంది. అటుగా వెళ్తున్న వీరు ఏదో అడ్రస్ అడిగారు. ఆమె చెబుతుండగానే వెనుక ఉన్న ప్రసాద్ ఒక్కసారిగా ఆమె మెడలోని గొలుసు లాగేశాడు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: KA Paul: కేఏ పాల్ ఎంట్రీ వెనుక ఎవరున్నారు? ఆయనకు పుషింగ్ ఇచ్చే వారెవరు?
షాక్ కు గురైన మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు రంగంలోకి దిగి సీసీ పుటేజీ ఆధారంగా వారిని గుర్తించి అరెస్టు చేశారు. వారిద్దరు పేరూర్ పచ్చపాళ్యంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రసాద్ ఆన్ లైన్ బెట్టింగులు ఆడి అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు ఇలా దొంగతనం ఎంచుకున్నాడు. దీంతో కటకటాలపాలయ్యాడు.
ప్రసాద్ ఇంట్లో అంతకుముందు బంగారం పోయిందని ఫిర్యాదు చేస్తే అతడే తీశాడని దర్యాప్తులో తేలడంతో తండ్రి కేసు వాపస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే తన ఇంటి నుంచే దొంగతనం మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. భవిష్యత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనంతో కష్టాలు తీరుతాయని ఆలోచించడం పొరపాటే. అందుకే వారు జైలు పాలయినట్లు తెలుస్తోంది.
Also Read:Telangana BJP: అతడే బీజేపీ సీఎం క్యాండిడేట్.. తెలంగాణ బీజేపీలో మళ్లీ హీట్