KA Paul: కేఏ పాల్ ఎంట్రీ వెనుక ఎవరున్నారు? ఆయనకు పుషింగ్ ఇచ్చే వారెవరు?

KA Paul: తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి అధికార పార్టీ టీఆర్ఎస్ కు బలం తగ్గిందని పీకే రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో గట్టెక్కడానికి సీఎం కేసీఆర్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా కేఏ పాల్ ఎంట్రీ కూడా అదే కోవలోనే జరిగిందని చెబుతున్నారు. రాష్ర్టంలో త్రిముఖ పోరు ఉంటుందని భావిస్తున్న తరుణంలో రోజురోజుకు కాంగ్రెస్, బీజేపీలు పుంజుకోవడంతో ఇక చేసేది లేక వాటిని అడ్డుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్లు […]

Written By: Srinivas, Updated On : May 4, 2022 2:18 pm
Follow us on

KA Paul: తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి అధికార పార్టీ టీఆర్ఎస్ కు బలం తగ్గిందని పీకే రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో గట్టెక్కడానికి సీఎం కేసీఆర్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా కేఏ పాల్ ఎంట్రీ కూడా అదే కోవలోనే జరిగిందని చెబుతున్నారు. రాష్ర్టంలో త్రిముఖ పోరు ఉంటుందని భావిస్తున్న తరుణంలో రోజురోజుకు కాంగ్రెస్, బీజేపీలు పుంజుకోవడంతో ఇక చేసేది లేక వాటిని అడ్డుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను కేఏపాల్ ను కూడా రాష్ట్రంలోకి తీసుకొచ్చిన ఘనత అధికార పార్టీకి దక్కుతుందని చెబుతున్నారు.

KA Paul

ఇప్పటికే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిరుగుతున్నారు. కాంగ్రెస్ కూడా తన పట్టు నిలుపుకునేందుకు వరంగల్ లో రాహుల్ గాందీతో రైతు సంఘర్షణ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ధీంతో అధికార పార్టీకి కంటిమీద కునుకు ఉండటం లేదు. అధికారం దూరమైతే పరువు పోతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను కేఏ పాల్ తమకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అని కేటీఆర్ తో చెప్పించి ఆయన ఎంట్రీకి మార్గం సుగమం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Telangana BJP: అతడే బీజేపీ సీఎం క్యాండిడేట్.. తెలంగాణ బీజేపీలో మళ్లీ హీట్

కేఏపాల్ కు అంత సత్తా ఉందా? ఆయర చెబితే ఓట్లు పడతాయా? రాజకీయాల్ని ప్రభావితం చేసే శక్తి ఉందా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న దాని పాచికలు పారే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత మామూలుగాలేదు. నేతల నుంచి ప్రజల దాకా అందరిలో అసంతృప్తి రగులుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే కేఏ పాల్ కాదు పనులే. రాష్ట్రంలో ఏం చేశారని ఓట్లు అడుగుతారనే వాదనలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బోర్లా పడటం ఖాయమని తెలిసిపోతోంది. అందులో భాగంగానే ఇన్ని డ్రామాలు ఆడుతున్నారనే విషయం తెలుస్తోంది.

KA Paul

ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టుతోనే కేసీఆర్ ఇవన్నీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లినా కేసీఆర్ కు 30 స్థానాలు మాత్రమేవస్తాయనే భయంతోనే కేసీఆర్ ఇలా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎక్కువ కాకుండా ఉండేందుకే కేఏ పాల్ పేరును బయటకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లను ఎదుర్కొనే క్రమంలో కేఏ పాల్ ఏం చేస్తారనే ప్రశ్నలుకూడా వస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ అధికారంకోసం ఎన్ని కుట్రలు పన్నినా అంతా తూచ్ అని తెలుస్తోంది.

కేఏ పాల్ ఎజెండా ఏమిటి? అతడిపార్టీ పేరు? ఎందు కోసం రాజకీయ ప్రవేశం చేస్తున్నారనే విషయాలపై స్పష్టత లేదు. ఏదో మొక్కుబడిగా పార్టీ పెడితే అంతే సంగతి. దానికి కర్త కర్మ క్రియ ఎవరనే సమాచారం లేదు. కేసీఆర్ ఆడించే డ్రామాల్లో కేసీఆర్ సక్సెస్ అవుతారా? లేక బొక్కబోర్లా పడతారా? అనేది తేలాల్సి ఉంది. అయితే రాజకీయ చదరంగంలో కేసీఆర్ ఎన్ని పాచికలు వేసినా అది ఆయన పతనానికే కాని అధికారానికి కాదని చెబుతున్నారు.

Also Read:Elon Musk- Twitter: ట్విటర్ ఉచితం కాదు.. ఇక డబ్బులట?

Tags