https://oktelugu.com/

Tamil Hero Vijay : 10 వ తరగతి మరియు 12 వ తరగతి టాపర్స్ కి వరాల జల్లు కురిపించిన తమిళ హీరో విజయ్!

ఆయన మాట్లాడుతూ 'ధనుష్ నటించిన అసురన్ మూవీ లో ఒక డైలాగ్ నన్ను ఎంతో ఆకట్టుకుంది,నీ దగ్గర డబ్బులు, స్థలం, ఆస్తులు ఎన్ని ఉన్నా దోచేయొచ్చు, కానీ నీ దగ్గర ఉన్న విద్య ని మాత్రం ఎవ్వరూ దోచేయలేరు,అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ విన్నప్పటి నుండి నాకు విద్యార్థులకు ఎదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తూ ఉండేది, ఈరోజు ఆ సమయం వచ్చింది కాబట్టి చేస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : June 18, 2023 / 09:16 AM IST
    Follow us on

    Tamil Hero Vijay : తమిళనాడు లో ప్రస్తుతం అనితర సాధ్యమైన స్టార్ స్టేటస్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని ట్రేడ్ పండితులు చెప్పే పేరుకి ,ఇలయథలపతి విజయ్. ఒకప్పుడు రజినీకాంత్ కి తమిళనాడు లో ఎలాంటి క్రేజ్ ఉండేదో, ఇప్పుడు విజయ్ కి అలాంటి క్రేజ్ ఉంది. కానీ అప్పట్లో రజినీకాంత్ సినిమాలు బాగాలేకపోతే ఫ్లాప్ అయ్యేవి , ఏ హీరో సినిమా అయినా అంతే , కంటెంట్ సరిగా లేకపోతే ఫ్లాప్ అవ్వడం ఖాయం.

    కానీ విజయ్ సినిమాలు బాగాలేకపోయిన ఆడేస్తున్నాయి. ఈ రేంజ్ పీక్ స్టార్ స్టేటస్ ఎవరూ ఇప్పటి వరకు చూడలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇంత ప్రజాభిమానం ఉన్న విజయ్ అతి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు, ఆయనకీ మొదటి నుండి సామాజిక స్పృహ ఉంది, తనకి తోచినంత సహాయం ఆపద సమయాల్లో చేస్తూనే ఉంటాడు.

    ఇక రీసెంట్ గా విజయ్ చేసిన ఒక గొప్ప కార్యక్రమాన్ని చూస్తే , ఇతను రాబొయ్యే రోజుల్లో కచ్చితంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు అనే విషయం అర్థం అవుతుంది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే తమిళనాడు లో ప్రకటించబడ్డ 10 వ తరగతి మరియు 12 వ తరగతి ఫలితాలలో టాపర్స్ గా నిల్చిన విద్యార్థుల కోసం ఒక గౌరవ సభని ఏర్పాటు చేసి, ఆ విద్యార్థులను సత్కరించి, ఒక్కొక్కరికి 10 వేల రూపాయిలు బహుమానం గా ఇచ్చాడు విజయ్.

    అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ధనుష్ నటించిన అసురన్ మూవీ లో ఒక డైలాగ్ నన్ను ఎంతో ఆకట్టుకుంది,నీ దగ్గర డబ్బులు, స్థలం, ఆస్తులు ఎన్ని ఉన్నా దోచేయొచ్చు, కానీ నీ దగ్గర ఉన్న విద్య ని మాత్రం ఎవ్వరూ దోచేయలేరు,అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ విన్నప్పటి నుండి నాకు విద్యార్థులకు ఎదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తూ ఉండేది, ఈరోజు ఆ సమయం వచ్చింది కాబట్టి చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.