https://oktelugu.com/

Director Om Raut : ఆదిపురుష్ డైరెక్టర్ ఇంత పెద్ద హిందూ వ్యతిరేకా? హనుమంతుడు మీద అనుచిత కామెంట్స్ 

ఆ ట్వీట్లో... హనుమంతుడు ఏమైనా చెవిటివాడా? మా ఏరియా జనాలు అదే అనుకుంటున్నారు. అందుకే హనుమాన్ జయంతి రోజు పెద్ద పెద్ద సౌండ్స్ తో పాటలు పెడుతున్నారు. అవి కూడా సంబంధం లేని పాటలు, అని కామెంట్ చేశాడు.

Written By:
  • Shiva
  • , Updated On : June 18, 2023 / 09:23 AM IST
    Follow us on

    Director Om Raut : ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ గతంలో వేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. అతడు హనుమంతుడిని, ఆయన భక్తులను కించపరిచే విధంగా ట్వీట్ చేశాడు. అది బయటకు తీసిన నెటిజెన్స్ ఏకి పారేస్తున్నారు. కేవలం ఆదిపురుష్ చిత్రాన్ని అమ్ముకోవడానికి హిందూవాదిలా నటిస్తున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. ఓం రౌత్ పరమ ఆంజనేయస్వామి భక్తుడిలా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకలో కలరింగ్ ఇచ్చాడు. రామాయణం ప్రదర్శించే ప్రతీచోటకు హనుమంతుడు వస్తాడని మా అమ్మ చెప్పింది. కాబట్టి ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు హనుమంతుడు కోసం ఖాళీగా ఉంచాలని నిర్మాతలకు నా రిక్వెస్ట్, అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

    నిర్మాతలు ఆయన కోరికకు మన్నించారు. మొదటి షో నుండే ఆదిపురుష్ థియేటర్స్ లో ఒక సీటు హనుమంతుడు కోసం కేటాయించారు. ఓం రౌత్, అతని ఫ్యామిలీ రాముడి పరమభక్తులు అన్నట్లు అందరూ భావించారు. ఈ క్రమంలో 2015లో ఓం రౌత్ చేసిన ఓ ట్వీట్ అందరి అభిప్రాయం మార్చివేసింది. సదరు ట్వీట్లో హనుమంతుడుని ఓం రౌత్ కించపరిచారు. హిందువుల నమ్మకాలను అవహేళన చేశాడు. 
     
    ఆ ట్వీట్లో… హనుమంతుడు ఏమైనా చెవిటివాడా? మా ఏరియా జనాలు అదే అనుకుంటున్నారు. అందుకే హనుమాన్ జయంతి రోజు పెద్ద పెద్ద సౌండ్స్ తో పాటలు పెడుతున్నారు. అవి కూడా సంబంధం లేని పాటలు, అని కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ ని నెటిజెన్స్ బయటకు తీశారు. ఓం రౌత్ అసలు స్వరూపం ఇది. ఆదిపురుష్ థియేటర్స్ లో హనుమంతుడికి సీటు కేటాయించడం అనేది ప్రమోషనల్ ట్రిక్ అంటున్నారు. 
     
    నిజానికి ఆదిపురుష్ థియేటర్స్ కి హనుమంతుడు వస్తాడనే నమ్మకం అతనికి లేదంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కాగా ఓం రౌత్ ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. ఇక ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ మాత్రం పర్లేదు అన్నట్లు ఉన్నాయి. ప్రభాస్ మేనియాతో కొంత మేర థియేటర్స్ నిండుతున్నాయి. హిందూ సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుంది.