Homeట్రెండింగ్ న్యూస్Forbes India- Syed Hafeez: ఫోర్బ్స్‌ ఇండియా’లో గోదావరి‘ఖని’జం.. సయ్య హఫీజ్‌కు అరుదైన గుర్తింపు!

Forbes India- Syed Hafeez: ఫోర్బ్స్‌ ఇండియా’లో గోదావరి‘ఖని’జం.. సయ్య హఫీజ్‌కు అరుదైన గుర్తింపు!

Forbes India- Syed Hafeez: సింగరేణి ప్రాంతంగా, పారిశ్రామిక నగరంగా, మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు ఉన్న రామగుండం, గోదావరిఖని ప్రాంతానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఇది కేవలం ఓ పాతికేళ్ల కుర్రాడు తీసుకొచ్చాడు. వ్యక్తిగతంగా ఫోర్బ్స్‌ ఇండియా జాబితాల్లో స్థానం సంపాదించి సింగరేణి ప్రాంతమైన గోదావరి‘ఖని’జంగా ఇటు పట్టణనికి, అటు స్వతహాగా గుర్తింపు పొందాడు ప్రముఖ తెలుగు టెక్‌ కంటెంట్‌ క్రియేటర్‌ సయ్యద్‌ హఫీజ్‌. ప్రముఖ బిజినెస్‌ పత్రిక ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసిన ‘టాప్‌ 100 డిజిటల్‌ స్టార్స్‌’ జాబితాలో హఫీజ్‌కు చోటు దక్కింది.

Forbes India- Syed Hafeez
Syed Hafeez

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైంటిం్లయిన్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ హఫీజ్‌ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. ఉన్నత విద్యను చదవకపోయినా టెక్నాలజీపై తనకున్న మక్కువతో 2011 నుంచి హఫీజ్‌ ‘తెలుగు టెక్‌ ట్యూట్స్‌’ పేరుతో వీడియో కంటెంట్‌ను అందిస్తున్నాడు. అటు సోషల్‌ మీడియాను.. ఇటు టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలి. మితిమీరిన టెక్నాలజీ వినియోగంతో రోజురోజుకి పెరిగిపోతున్న ప్రమాదాల గురించి యూజర్లకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతోపాటు మార్కెట్‌లో విడుదలైన లేటెస్ట్‌ గాడ్జెట్స్, స్మార్ట్‌ ఫోన్ రివ్వూ్య వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆకట్టుకోవడాన్ని ఫోర్బ్స్‌ ఇండియా గుర్తించింది. 8.89 క్రియేట్‌ స్కోర్‌తో టాప్‌ 100 డిజిటల్‌ స్టార్ట్స్‌లో చోటు కల్పిచ్చింది.

Also Read: TDP MPs: తలోదారిలో టీడీపీ ఎంపీలు? అసంతృప్తికి కారణాలేంటి?

16 లక్షల సబ్‌స్క్రైబర్స్‌.. నెలకు రూ.2 లక్షల ఆదాయం..
టెక్‌ కంటెంట్‌తో యూజర్లకు ఆకట్టుకుంటున్న సయ్యద్‌ హఫీజ్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ప్రస్తుతం 16 లక్షల మంది సబ్‌ స్క్రైబర్లతో నెలకు రూ.2 లక్షల ఆదాయం అర్జిస్తున్నారు. ఫోర్బ్స్‌ ఇండియా, ఐఎన్ సీఏ, గ్రూప్‌ ఎం సంస్థలు సంయుక్తంగా డిజటల్‌ స్టార్ట్స్‌ ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్ , బిజినెస్, ఫిట్‌నెస్, ఫుడ్,టెక్, ట్రావెల్, సోషల్‌ వర్క్‌ ఇలా తొమ్మిది రకాల కంటెంట్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్న 100కి ర్యాంకులు విధించింది.

Forbes India- Syed Hafeez
Syed Hafeez

ఇలా ఎంపిక..
టాప్‌ 100 డిజిటల్‌ స్టార్స్‌లో స్థానం సంపాదించిన కంటెంంట్‌ క్రియేటర్లు నెటిజన్లు ఆకట్టుకోవడంతోపాటు క్రియేట్‌ చేసే కంటెంట్‌ ఎంతమందికి రీచ్‌ అవుతుంది. ఎంత మంది ఆ కంటెంట్‌తో ఎంగేజ్‌ అవుతున్నారు. ఆ కంటెంట్‌ జెన్యూన్ గా ఉందా? లేదా? ఇలా అన్నీ రకాలు పరిశీలించిన తర్వాతే ఈ జాబితాను విడుదల చేసినట్లు ఫోర్బ్స్‌ ఇండియా పేర్కొంది. ఈ లిస్ట్‌లో సయ్యద్‌ హఫీజ్‌ 32వ స్థానం దక్కడం విశేషం.

Also Read:Konda Vishweshwar Reddy- RK: టీఆర్ఎస్, కేసీఆర్ సీక్రెట్స్ అన్నీ లాగేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version