Swara Monsoon Musical Masti : కరోనా కల్లోలంతో గడిచిన రెండేళ్లుగా ఎలాంటి కార్యక్రమాలు లేవు. ఓ ఆటా లేదు.. ఓ పాట లేదు. ముసుగులు ధరించి అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. బయటకొచ్చినా కూడా గుంపుగా తిరగలేని పరిస్తితి. ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. దేశంలోనూ కరోనా కేసులు తగ్గడం.. వ్యాక్సినేషన్ జరగడంతో కేసుల తీవ్రత లేదు.
ఐదుగురు గాయకులతో హైదరాబాద్ లో తొలిసారిగా ప్రత్యక్ష సంగీత కార్యక్రమాన్ని వీకే ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలో ఐదుగురు టాప్ గాయకులు పాల్గొంటుడడం విశేషంగా మారింది. ఈనెల 23న వీకే ఎంటర్ టైన్ మెంట్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని టాప్ గాయకులతో స్వరమాన్ సూన్ మస్తీ ప్రత్యక్ష సంగీత కార్యక్రమం శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నారు.
టాలీవుడ్ కు చెందిన ఐదుగురు టాప్ గాయకులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో తొలిసారిగా ప్రత్యక్ష సంగీత కార్యక్రమాన్ని వీకే ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్వహిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో దాదాపు సుధీర్ఘ విరామం తర్వాత ప్రత్యక్ష సంగీత కచేరీలకు అతి పెద్ద వేదిక కానుంది.
స్వరమాన్ సూన్ మ్యూజికల్ మస్తీ పేరుతో ఇప్పుడు అభిమానుల ముందుకు వస్తుంది. ఈనెల 23న టాప్ సింగర్స్, మ్యూజిషియన్ లతో కలిసి శిల్పకళావేదికలో సిద్ధమైంది. వికే ఎంటర్ టైన్ మెంట్స్ ప్రతినిధులు వినయ్ కుమార్ మరియు తేజస్వినిలు మాట్లాడారు. వీకే ఎంటర్ టైన్ మెంట్ ఆధ్వర్యంలో స్వరమాన్ సూన్ మ్యూజికల్ మస్తీతో మన టాలీవుడ్ టాప్ సింగర్స్ అయిన గీతామాధురి, రాహుల్ సిప్లిగంజ్, సింహ, దామని, అరుణ్ కౌండిన్యతో హైదరాబాద్ లో జులై 23న శిల్పకళా వేదికలో ఈ మ్యూజిక్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.
ఈ మ్యూజిక్ మస్తీ కచేరిని తొలిసారిగా నిర్వహిస్తుండడం.. టాప్ గాయకులు పాడుతుండడంతో వీక్షకుల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ షో టికెట్స్ ను బుక్ మై షో లో బుక్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని సంస్థ కార్యక్రమంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, దామిని, సింహ, అరుణ్ కాండిన్య , తేజస్విని, వినయ కుమార్ కలిసి పోస్టర్ ను.. టికెట్ ను ప్రారంభించారు.