Sushmita Sen : బ్రేకింగ్ : స్టార్ హీరోయిన్ సుస్మిత సేన్ కి గుండెపోటు..కండీషన్ ఏంటంటే?

Sushmita Sen Heart Attack : ఈమధ్య కాలం లో సెలెబ్రెటీలకు గుండెపోటు రావడం, వెంటనే మరణించడం వంటి ఘటనలు తరుచు జరుగుతూనే ఉన్నాయి.అలా రీసెంట్ గా తారకరత్న కూడా చనిపోయాడు, అంతకుముందు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే గుండె పోటు వచ్చి స్పాట్ లో చనిపోయాడు.కేవలం సెలెబ్రితులకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా ఈ అకస్మాత్తుగా గుండెపోట్లు రావడం సంచలనం రేపుతోంది.ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ […]

Written By: Neelambaram, Updated On : March 2, 2023 4:47 pm
Follow us on

Sushmita Sen Heart Attack : ఈమధ్య కాలం లో సెలెబ్రెటీలకు గుండెపోటు రావడం, వెంటనే మరణించడం వంటి ఘటనలు తరుచు జరుగుతూనే ఉన్నాయి.అలా రీసెంట్ గా తారకరత్న కూడా చనిపోయాడు, అంతకుముందు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే గుండె పోటు వచ్చి స్పాట్ లో చనిపోయాడు.కేవలం సెలెబ్రితులకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా ఈ అకస్మాత్తుగా గుండెపోట్లు రావడం సంచలనం రేపుతోంది.ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మిత సేన్ కి కూడా గుండెపోటు వచ్చిందట.

కానీ ఆమె సురక్షితంగానే బయటపడింది.ఈ విషయాన్నీ స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.ఆమె మాట్లాడుతూ ‘నాకు ఇటీవలే గుండెపోటు వచ్చింది ,కానీ మా వాళ్ళు వెంటనే నన్ను ఆసుపత్రి లో చేర్పించి, యాంజియో ప్లాస్టీ చేసి స్తుంటు వేశారు,సకాలం లో స్పందించి నాకు చికిత్స అందించడం వల్ల నేను సురక్షితంగా బయటపడ్డాను’ అంటూ ఒక ట్వీట్ వేసింది.

ఆమెకు ఎలాంటి ప్రాణహాని కలుగకుండా సురక్షితంగా బయటపడినందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, పూర్తి స్థాయిలో కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు,సుస్మిత సేన్ బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ అనే విషయం మన అందరికి తెలిసిందే, సుమారుగా 50 సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించింది.తెలుగులో ఈమె అక్కినేని నాగార్జున తో ‘రక్షకుడు’ అనే సినిమా చేసింది.అంతే కాదు, ఈమె సినిమాల్లోకి రాకముందే మిస్ యూనివర్స్ టైటిల్ ని కూడా గెలుచుకుంది.2015 వ సంవత్సరం వరకు సినిమాల్లో బిజీ గా గడిపిన ఈమె ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది.