T Hub: టీ హబ్ , సుజుకీ ఇనిషియేటివ్ నెక్ట్స్ బిగ్ డీల్.. గ్రామీణ ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యం..

తెలంగాణలోని యువతను వివిధ రంగాల్లో అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం T Hub ను ఏర్పాటు చేసింది. వివిధ జిల్లాలో టీ హబ్ లను ఏర్పాటు చేసి యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగాలు, ఉపాధిని కల్పించాలని భావించారు. ఇప్పటికే టీ హబ్ ద్వారా యువతను వివిధ రంగాల్లో ప్రోత్సహించేందుకు పలు అవకాశాలను కల్పిస్తోంది.

Written By: Chai Muchhata, Updated On : July 18, 2024 12:45 pm

T Hub

Follow us on

T Hub: భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా.. ప్రపంచ దేశాలతో వివిధ రంగాల్లో పోటీ పడుతోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో ఇండియన్లు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. సాప్ట్ వేర్ నుంచి స్పేస్ వరకు భారతీయులు తమ సత్తా చాటుతున్నారు. అయితే స్వదేశంగా యువతను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాయి. తాజాగా ఇన్నోవేషన్ ని ప్రొత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన T Hub, సుజుకీ ఇనిషియేటివ్ నెక్ట్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యమైన పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. దీనికి సంబంధించి ఇరు సంస్థల ప్రతినిధులు వివరాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

తెలంగాణలోని యువతను వివిధ రంగాల్లో అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం T Hub ను ఏర్పాటు చేసింది. వివిధ జిల్లాలో టీ హబ్ లను ఏర్పాటు చేసి యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగాలు, ఉపాధిని కల్పించాలని భావించారు. ఇప్పటికే టీ హబ్ ద్వారా యువతను వివిధ రంగాల్లో ప్రోత్సహించేందుకు పలు అవకాశాలను కల్పిస్తోంది. ఇందు కోసం నిపుణులతో శిక్షణను ఇస్తోంది అయితే తాజాగా సుజుకీ ఇనిషియేటివ్ నెక్ట్స్ తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

ఈ రెండు సంస్థల భాగస్వామ్యం ద్వారా కీలక కార్యక్రమాలు చేపట్టనున్నారు. రెండు సంస్థలు కలిసి జాయింట్ ఈవెంట్ లు, వర్క్ షాప్ లు నిర్వమించనున్నారు. ఇవి పట్టణ ప్రాంతాల్లో కంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయడానికి ఫోకస్ పెడుతారు. వీరికి టైర్ 2, టైర్ 3 నగరాల స్టార్టప్ లు మద్దతు ఇవ్వనున్నాయి. నెక్ట్స్ భారత్ వెంచర్స్ తో దేశంలోని గ్రామీణ, ఇతర రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముందుగా 4 నెలల పాటు ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు జూలై 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ను స్వీకరించిన తరువాత వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పడు సమాచారాన్ని అందజేస్తుంది. ఈ ప్రొగ్రాంను 2024 అక్డోబర్ 14 నుంచి ప్రారంభం అవుతుంది. దాదాపు రెండు వారాల పాటు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వివిధ పరిశ్రమల ప్రముఖుల నుంచి, ఎంచుకున్న స్టార్టప్ ల నుంచి రూ. కోటి నుంచి 5 కోట్ల వరకు ఈక్విటీ పెట్టుబడులను స్వీకరించనున్నారు. వీటితో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ మేరకు టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ద్వారా స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారతీయ పారిశ్రామిక వేత్తలను అందించడానికి వీలవుతుందని అన్నారు. నెక్ట్స్ భారత్ వెంచర్స్ సీఈవో విపుల్ నాథ్ జిందాల్ మాట్లాడుతూ పర్యావరణ వ్యవస్థలోని వాటాదారులతో సన్నిహితంగా ఉండడంతో ఎంటర్ ప్రైజేస్ లు శక్తివంతంగా మారుతాయని అన్నారు. ఇదిలా ఉండగా నెక్ట్స్ భారత్ వెంచర్స్ విపుల్ నాథ్ జిందాల్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ నుంచి రోనిత్ కుమార్, తమ్మినేని ప్రత్యూష, సచిన్ అహుజా లు ఈ ఒప్పందపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీహబ్ నుంచి సుజిత్ జాగీర్దార్, అవినాష్ కేదారి, ఇన్నోవేషన్ కన్సల్టెంట్ సుశోవన్ చటర్జీ తదితరులు పాల్గొన్నారు.