Homeఎంటర్టైన్మెంట్Sushmita Sen: లేటు వయసులో ఘాటు ప్రేమ: సుస్మతా డేటింగ్ ఎవరితోనో తెలుసా?

Sushmita Sen: లేటు వయసులో ఘాటు ప్రేమ: సుస్మతా డేటింగ్ ఎవరితోనో తెలుసా?

Sushmita Sen: బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్ చాన్నాళ్ల తరువాత న్యూస్ మేకర్ గా మారారు. ఆమె తాజాగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీతో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని లలిత్ మోడీ ట్విట్టర్ ద్వారా ఫొటోలు షేర్ చేసి తెలిపారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుస్మితా సేన్ బాలీవుడ్ తో పాటు తమిళం, తెలుగు సినిమాల్లో నటించి అలరించారు. అంతేకాకుండా విశ్వసుందరిగానూ ఎంపికయ్యారు. అయితే 40 ఏళ్ల పైబడి ఉన్న సుస్మితా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. తనకంటే చిన్నవయసులో ఉన్న ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. ఈమధ్యే వీరి విడిపోయినట్లు ప్రకటించారు. ఇప్పుడు లలిత్ మోడీతో ప్రేమలో పడినట్లు తెలవడంతో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Sushmita Sen
Sushmita Sen, Lalit Modi

 

సుస్మితా సేన్ తో తన కొత్త జీవితం ప్రారంభమైందని లలిత్ మోడీ తెలిపారు. అయితే ఆమెను పెళ్లి చేసుకునే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమెతో డేటింగ్ ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ న్యూస్ పై నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సుస్మితా సేన్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. ఇప్పటికీ ఆమె ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. కానీ తనకంటే వయసులో చిన్నవాడైన రోహ్మాన్ షాల్ అనే వ్యక్తితో సహజీవనం సాగించింది. అయితే వీరిద్దరు గత డిసెంబర్ 3న విడిపోతున్నట్లు ప్రకటించారు.

Also Read: Gargi Movie Review: రివ్యూ: గార్గి

తాజాగా ఆమె లలిత్ మోడీ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట్లో వీరి గురించి హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. డబ్బులుంటే ఏదైనా సాధ్యమే అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం బాలీవుడ్ నటీమణులు ఇలా భర్తలు మార్చడం కొత్తేమీ కాదని అంటున్నారు. అయితే సుస్మితా సేన్ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన ఆమె తెలుగులోనూ నటించారు. అక్కినేని నాగార్జునతో కలిసి ‘రక్షకుడు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు.

Sushmita Sen
Lalit Modi, Sushmita Sen

మరో ఆసక్తికర విషయమేంటంటే.. సుస్మతాసేన్ హైదరాబాద్లోనే పుట్టారు. 1975 నవంబర్ 19న ఆమె జన్మించారు. ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ఖ సేన్ భారత వాయుసేనలో వింగ్ కమాండర్ గా పనిచేశారు. తల్లి శుబ్రా సేన్ ఓ ఫ్యాషన్ డిజైనర్. విద్యాభ్యాసం కోసం ఢిల్లీ వెళ్లిన సుస్మితా మోడల్ గా రాణించారు. ఈ క్రమంలో ఆమె 1994 సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యారు. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. హిందీతో పాటు తమిళ సినిమాల్లోనూ ఆమె అలరించారు.

Also Read:Vijayendraprasad Rajakar Files: రజాకర్ ఫైల్స్.. డిఫెన్స్ విజయేంద్రప్రసాద్.. బీజేపీ చెప్పినట్టు చేస్తారా?
Recommended Videos
10 మందితో డేటింగ్ చేసి రికార్డు సృష్టించిన సుస్మిత సేన్ || Susmitha Sen || Oktelugu Entertainment
Chiyaan Vikram Entry at #Chiyaan61 Movie Pooja Event || Chiyaan Vikram Arrives in Stylish Look
అడ్డంగా బుక్కైన నరేష్-పవిత్రా లోకేష్ || Naresh Pavitra Lokesh Latest News
కుమార్తెతో బిడ్డను కన్న 76 ఏళ్ల ఎలాన్ మస్క్ తండ్రి || Elon Musk Father Errol Musk || Viral News

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version