Second Marriage: బిహార్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకుంటే అనుమతి తప్పనిసరి. ఇటీవల కాలంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు పలు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో భార్యలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగుల భార్యలు పడే బాధలను లెక్కలోకి తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో భార్యలు పలు సమస్యల్లో పడుతున్నారు. వీటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.

బిహార్ లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలంటే అనుమతి తప్పనిసరి చేస్తూ చట్టం చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఉద్యోగులు ఏ కారణం చేతనైనా రెండో వివాహం చేసుకోదలుచుకుంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండో పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చట్టం చేసింది. దీంతో రెండో పెళ్లి చేసుకునే వారు అనుమతి తీసుకున్నాకే వారినుంచి పర్మిషన్ వచ్చాకే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎవరైనా సమ్మతించాల్సిందే.
Also Read: Athma Sakshi Survey: ఆత్మసాక్షి సర్వే: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
ఏ కారణం చేతనైనా జీవిత భాగస్వామి మరణిస్తే లేదా విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవడానికి అర్హులే. కానీ ముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాల్సిందేనని నిబంధన విధించింది. దీంతో రెండో పెళ్లి చేసుకునే వారు తమ అభ్యర్థనను ప్రభుత్వానికి విన్నవించి తరువాత పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. కొందరు మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుంటుంటారు. ఈ విషయంలో మొదటి భార్యకు తెలియకుండా రెండో వివాహం చేసుకుంటే ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందవు.

మొదటి భార్య బతికుండగానే, విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేస్తే వారి పిల్లలకు ఎలాంటి హక్కులు ఉండవు. ఆస్తిలో వాటా రాదు. ప్రభుత్వ పథకాల్లో కూడా ప్రాధాన్యం ఉండదు. దీంతో ముందస్తుగా అనుమతి తీసుకున్నాకే వివాహం చేసుకోవచ్చు. పర్మిషన్ తీసుకోకుండా వివాహం చేసుకుంటే వారికి పుట్టే పిల్లలు ప్రభుత్వ పథకాలకు అర్హులు కారు. ఒకవేళ మొదటి భార్య ఉంటే వారికే అన్ని వర్తిస్తాయి. దీంతో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఉద్యోగుల పాలిట శాపంగానే మారనుందని తెలుస్తోంది.
Also Read:
AP Government: ఏపీ సర్కారులో అంతర్మథనం… అందుకే అధికారుల సచివాలయాల బాట..