Sushant Singh Rajput: యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం దేశాన్ని కుదిపేయగా… సంఘటన జరిగిన రెండున్నరేళ్ల అనంతరం పోస్టుమార్టం చేసిన వ్యక్తి సంచలన కామెంట్స్ చేశారు. నా ఉద్దేశంలో ఇది ఆత్మహత్య కాదు మర్డర్ అన్నారు. పోస్టుమార్టంలో పాల్గొన్న రూప్ కుమార్ షా మాట్లాడుతూ… సుశాంత్ సింగ్ చనిపోయిన రోజు కూపర్ ఆసుపత్రికి 5 శవాలు వచ్చాయి. వాటిలో ఒకటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది. నేను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాడీ మీద కొన్ని గాయాలు గమనించాను. అతని మెడపై కూడా గాయాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదు మర్డర్ అని సందేహం కలిగింది. పై అధికారులకు నేను ఇదే చెప్పాను.

సుశాంత్ శరీరంపై గాయాలు ఉన్నాయి. ఇది మర్డర్ కావచ్చు, మనం ప్రొసీజర్ ఫాలో అవుదామని చెప్పాను. పోస్టుమార్టం వీడియో రికార్డు చేయాల్సి ఉంది. కానీ అధికారులు వద్దు అన్నారు. కేవలం ఫోటోలు తీసుకొని పోలీసులకు బాడీని అప్పగించనున్నారు. సుశాంత్ మరణించిన రాత్రి పోస్టుమార్టం పూర్తి చేశాము, అని చెప్పుకొచ్చాడు. సుశాంత్ సింగ్ మరణం పై సుదీర్ఘ విచారణ జరిగింది. ఈడీ, ఎన్సీబీ, సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఫైనల్ గా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని తేల్చారు.
సుశాంత్ తండ్రి కేకే సింగ్ నా కొడుకుది ఆత్మహత్య కాదు మర్డర్ అని వాదిస్తున్నారు. సుశాంత్ హత్యలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రమేయం ఉందని ఆరోపించారు. తాజాగా రూపేష్ కుమార్ షా చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యారు. ఆమెతో పాటు తమ్ముడు షోవిక్ చక్రవర్తి రిమాండ్ అనుభవించారు. 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ బాంద్రాలో గల తన అపార్ట్మెంట్ లో ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించారు.

సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. అభిమానులు పెద్ద ఎత్తున ప్రముఖులపై సోషల్ మీడియా యుద్ధం ప్రకటించారు. అలియా భట్, కరీనా కపూర్, కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్ ఇలా పలువురిని టార్గెట్ చేశారు. నెపోటిజం కారణంగానే సుశాంత్ మరణించారంటూ బాయ్ కాట్ బాలీవుడ్ నినాదం తెరపైకి తెచ్చారు. నెటిజన్స్ దెబ్బకు కొన్ని నెలల పాటు అలియా భట్, కరణ్ జోహార్, కరీనా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.