Bigg Boss Baladitya: స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెలిగిపోయిన బాలాదిత్య చంటిగాడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆయనకు బ్రేక్ రాలేదు. ప్రస్తుతం నటుడిగా ఆయన కొనసాగుతున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ అయిన బాలాదిత్య టీచర్ కూడాను. ఆయన చార్టెడ్ అకౌంట్స్ స్టూడెంట్స్ కి పాఠాలు చెబుతారు. ఆయనలో ఇంకా చాలా విద్యలే ఉన్నాయి. కాగా బాలాదిత్యకు బిగ్ బాస్ సీజన్ 6లో అవకాశం వచ్చింది. 21 మందితో మొదలైన ఈ రియాలిటీ షోలో బాల ఆదిత్య ప్రవర్తన, ఆటతీరుతో మెప్పించాడు. చాలా సావధానంగా మాట్లాడుతూ… హౌస్లో అందరినీ గైడ్ చేసేవాడు బాలాదిత్య.

గొడవలు లేకుండా సెటిల్మెంట్ చేస్తున్న బాలాదిత్య గేమ్ నాగార్జునకు నచ్చలేదు. ఫస్ట్ వీక్ నుండే నాగార్జున బాలాదిత్యను టార్గెట్ చేశాడు. నువ్వు గేమ్ ఆడకపోగా మిగతా కంటెస్టెంట్స్ ని చెడగొడుతున్నావని చివాట్లు పెట్టాడు. ఎలిమినేట్ అయ్యే వరకు బాలాదిత్యపై నాగార్జున అక్కసు వెళ్లగక్కాడు. బాలాదిత్య, ఆదిరెడ్డిలను నాగార్జున వాంటెడ్ గా టార్గెట్ చేశారు అనిపిస్తుంది. వీరిద్దరూ చిన్న తప్పు చేసినా నాగార్జున బూతద్దంలో చూసేవాడు. అంచనాల మధ్య హౌస్లో అడుగుపెట్టిన బాలాదిత్య త్వరగానే ఎలిమినేట్ అయ్యారు.
అయితే బాలాదిత్య తన ఎలిమినేషన్ ని హుందాగా అంగీకరించారు. ఏడుపులు పెడబొబ్బలు కార్యక్రమం పెట్టకుండా చిరునవ్వుతో బయటకు వచ్చేశాడు. అందరికీ బెస్ట్ విషెస్ చెప్పి సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. కాగా బాలాదిత్య హౌస్లోకి వెళ్లే ముందే ఆయన భార్య రెండో కూతురికి జన్మనిచ్చారు. తనివితీరాచూసుకోకుండానే బాలాదిత్య హౌస్లో అడుగుపెట్టాడు. ఇక బాలాదిత్య బయటకు వచ్చే వరకు కూతురికి పేరు పెట్టలేదు. ఆ కార్యక్రమం ఇటీవల ఘనంగా నిర్వహించారు.

బాలాదిత్య కూతురు బారసాల కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. గీతూ,ఇనయా, ఆరోహిరావుతో పాటు మరికొందరు హాజరై సందడి చేశారు. బాలాదిత్య చిన్న కూతురికి యజ్ఞ విధార్తి అని పేరు పెట్టారు. బాలాదిత్యకు ఫస్ట్ సంతానం కూడా అమ్మాయి. ఆ పాప నాగార్జునకు పెద్ద ఫ్యాన్ అట. ఓ రోజు నాగార్జునతో మాట్లాడిస్తేనే అన్నం తింటానని మారాం చేసిందని బాలాదిత్య నాగార్జునకు చెప్పారు. ఇక తన ఇద్దరు కూతుళ్లు భార్యతో పాటు ఫోటో దిగిన బాలాదిత్య ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. బాలాదిత్య క్యూట్ ఫ్యామిలీ ఫోటో వైరల్ అవుతుంది.