Prabhas- Maruthi Movie: దర్శకుడు మారుతితో ప్రభాస్ మూవీ అనగానే ఫ్యాన్స్ పెదవి విరిచారు. ఇప్పటికే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తో దెబ్బతిన్నాం… మరోసారి ఆ తప్పు చేయవద్దంటూ తలబాదుకున్నారు. రాధే శ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ దర్శకుడు మారుతి చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. అవును ఆయన దర్శకత్వంలో ఒక మూవీ ఉందని రిపోర్టర్ ప్రశ్నకు సమాధానం చెప్పారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రెండు ప్లాప్స్ చూశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన సాహో, రాధే శ్యామ్ అంచనాలు అందుకోలేకపోయాయి. కొత్త దర్శకులను నమ్ముకుంటే నిరాశే ఎదురవుతుంది. ఇకపై మీ స్టార్డం కి తగ్గ చిత్రాలు చేసే దర్శకులనే ఎంచుకోవాలని ఫ్యాన్స్ ప్రభాస్ కి విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే ప్రభాస్ ఆల్రెడీ మారుతి మూవీ షూట్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఈ మూవీ షూట్ జరుగుతుంది. తాజాగా ప్రభాస్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. మారుతి-ప్రభాస్ మూవీ సెట్స్ నుండి ఒక వీడియో లీక్ అయ్యింది. సదరు వీడియోలో ప్రభాస్ లుక్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ లుక్ చూశాకా… ఇప్పటి వరకూ చేసిన నెగిటివ్ పబ్లిసిటీ పక్కన పెట్టి ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నారు. కారణం గత రెండు చిత్రాలతో పోల్చితే ప్రభాస్ గెటప్ అండ్ లుక్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ కి తెగ నచ్చేశాయి.
ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ పట్ల ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. కాగా ప్రభాస్ ఇంత వరకు చేయని జోనర్ మారుతి ట్రై చేస్తున్నట్లు సమాచారం. కామెడీ హారర్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉంటుంది అంటున్నారు. ఒక భారీ థియేటర్ సెట్ వేయగా సినిమా ప్రధాన భాగం అందులోనే సాగుతుందట. అసలు హారర్ కామెడీ జోనర్లో ప్రభాస్ మూవీ చేయడమేంటనీ మరో ప్రక్క సందేహాలు చంపేస్తున్నాయి. ఇక బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ప్రకటించిన చిత్రాలన్నీ డిఫరెంట్ జోనర్లో ఉన్నాయి.

సాహో, సలార్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, ఆదిపురుష్ పౌరాణిక చిత్రం. రాధే శ్యామ్ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందుతుంది. ప్రభాస్ సినిమాల ఎంపిక అద్భుతంగా ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదు. సాహో కొంతలో కొంత పర్లేదు. కనీసం హిందీలో అది విజయం సాధించింది. రాధే శ్యామ్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ప్రభాస్ కెరీర్లో అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.