Homeట్రెండింగ్ న్యూస్Anvesh Youtuber: యువతులతో మసాజ్.. బ్యాంకాక్ లో బ్యాంగ్ బ్యాంగ్.. నువ్వు మామూలు ఆటగాడివి కాదు...

Anvesh Youtuber: యువతులతో మసాజ్.. బ్యాంకాక్ లో బ్యాంగ్ బ్యాంగ్.. నువ్వు మామూలు ఆటగాడివి కాదు భయ్యో

Anvesh Youtuber: కష్టే ఫలి.. అంటారు పెద్దలు. అంటే కొన్నిసార్లు బాగా కష్టపడినప్పటికీ పెద్దగా ఫలితం ఉండదు. కానీ కొందరికి ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. ప్రస్తుత యూట్యూబ్ జమానాలో అయితే ఎంత కష్టపడితే అంత పేరు. అలాంటి పేరు సంపాదించుకున్న వారిలో చాలామంది ఉన్నారు. వారిలో ఇతడు మాత్రం చాలా ప్రత్యేకం. ఎక్కడో మారుమూల ఉత్తరాంధ్రకు చెందిన ఇతడు చేతిలో చిల్లిగవ్వలేకున్నా కూడా.. కేవలం మొండి ధైర్యంతోనే.. యూట్యూబ్ ద్వారా సంపాదించిన సంపాదనతోనే ప్రపంచం మొత్తం చుట్టి వస్తున్నాడు. ప్రపంచ ఏడు వింతలు ఇప్పటికే చూపించాడు. త్వరలో కంబోడియాలోని హిందూ దేవాలయాన్ని సందర్శించనున్నాడు. అమెరికా నుంచి ఆఫ్రికా దాకా దుర్భేద్యమైన ప్రాంతాలను చుట్టి వచ్చాడు. అతనిలోని ఆ తెగువే చూసేవాళ్లకు నచ్చింది.. ఏకంగా 12 లక్షల మంది సబ్ స్క్రైబర్లను చేసింది. ఫలితంగా అతడికి దండిగా ఆదాయం సమకూరుతున్నది. ఇంతకీ అతడి పేరు ఏంటంటే.. ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి.. అన్వేష్.. ప్రపంచ యాత్రికుడు.

ప్రపంచ యాత్రలో భాగంగా అరబ్ దేశాలను వచ్చిన అన్వేష్. ఆపిల్ ఫోన్, ఇతర గాడ్జెట్లు కొనుగోలు చేసేందుకు దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడినుంచి నేరుగా బ్యాంకాక్ ప్రయాణమయ్యాడు. గత ఏడాది న్యూ ఇయర్ వేడుకలను పట్టాయా లో జరుపుకున్నాడు. ఈసారి బ్యాంకాక్ వెళ్ళిపోయాడు. అపరిమితమైన స్వేచ్ఛ ఉంటే బ్యాంకాక్ లో అన్వేష్ న్యూ ఇయర్ వేడుకలను విపరీతంగా ఎంజాయ్ చేశాడు. బ్యాంకాక్ నగరాన్ని చుట్టివచ్చి అక్కడ ఉన్న విశేషాలను తన సబ్స్క్రైబర్లతో పంచుకున్నాడు. అందమైన యువతులతో మసాజ్ చేయించుకున్నాడు. ఆ తాలూకూ వీడియోను కూడా తన సబ్స్క్రైబర్లకు చూపించాడు. ఆ తర్వాత రాత్రిపూట తను జరిపిన ఆటను కూడా సబ్స్క్రైబర్లతో పంచుకున్నాడు.. బ్యాంకాక్ అంటేనే విపరీతమైన స్వేచ్ఛకు ప్రతిరూపమని, దానిని తాను ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నానని అన్వేష్ చెప్పుకొచ్చాడు.

యూట్యూబ్లో అన్వేష్ ఈ వీడియో పోస్ట్ చేయగానే దాదాపు మూడు లక్షలకు పైగా వ్యూస్ నమోదు చేసుకొని ట్రెండింగ్ లో నిలిచింది. తాను విహారయాత్రలో ఉన్నప్పుడు పలు విషయాలను సబ్స్క్రైబర్లతో ఎటువంటి మొహమాటం లేకుండా అన్వేష్ పంచుకుంటాడు. తాను మంచి ఆటగాడినని, అనేకమైన విదేశీ పిచ్ ల పై ఆటలు ఆడానని అన్వేష్ గొప్పగా చెప్పుకున్నాడు.. అలాంటి మాటలే అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి. సోషల్ మీడియాలో స్టార్ ను చేశాయి. ఆ మధ్య నవీన్ పొలిశెట్టి తన సినిమా ప్రమోషన్ కోసం అన్వేష్ ను ఉపయోగించుకున్నాడు అంటే స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. అన్నట్టు బ్యాంకాక్ వీడియోలో ఏమాత్రం అసభ్యతకు తావు లేకుండా అన్వేష్ అక్కడి విశేషాలు చెప్పే ప్రయత్నం చేశాడు. పైగా అక్కడి తెలుగు వారితో మమేకమై సరదాగా కబుర్లు చెప్పాడు. స్థూలంగా అతని నేర్చుకోవాల్సింది ఏంటంటే.. కష్టపడాలి. విజయం సాధించాలి. మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకోవాలి. ఇవి ఉంటే ఆటోమేటిక్ గా డబ్బు అదే వస్తుంది. దీన్నే అన్వేష్ నమ్మాడు. ఆచరణలో పెట్టాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular