Shivaji vs Anasuya: దండోరా సినిమా ఈవెంట్లో శివాజీ హీరోయిన్ల డ్రెస్ ల మీద చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిమీద ప్రముఖ యాంకర్, నటి అయిన అనసూయ సైతం స్పందించింది. ఇక ఈ విషయం గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. దీని మీద చాలా మంది సినిమా సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. ముఖ్యంగా శివాజీ అనసూయ మధ్య జరుగుతున్న వివాదంగా దీన్ని పరిగణించారు. వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. శివాజీ హీరోయిన్లు చాలా పద్ధతిగా ఉంటే చూసే వాళ్లకు అందంగా కనిపిస్తారని చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని పబ్లిక్ ఫంక్షన్స్ కి రావడం వల్ల చూసే వ్యక్తులు సైతం వాళ్ళని తిట్టుకునే అవకాశాలు ఉన్నాయంటూ మాట్లాడాడు. దీని మీద అనసూయ మేము డ్రెస్సులు ఎలా వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు అంటూ ఒక కాంట్రవర్సీ కామెంట్ అయితే చేసింది.
అక్కడి నుంచి దీని మీద రోజుకోకా సెలబ్రిటీ అందిస్తూ ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. శివాజీ స్పందించి తను సారీ చెప్పినా కూడా ఈ వివాదం సద్దుమనగడం లేదు. నిజానికి సోషల్ మీడియాలో చాలా మంది శివాజీ మాటలను సపోర్ట్ చేస్తున్నారు. ఆయన చెప్పిన విధానంలో వల్గారిటీ ఉందేమో కానీ ఆయన చెప్పింది మాత్రం వాస్తవం.
ఆ వాస్తవాన్ని గ్రహిస్తే సరిపోతుంది అలా కాకుండా మీరందరూ ఎందుకని అతని మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు అంటూ శివాజీని సపోర్ట్ చేస్తూనే అనసూయ ను విమర్శిస్తున్నారు.
ఇక ఇది తగదన్నట్టుగా యూట్యూబర్ అన్వేష్ సైతం ఈ విషయం మీద స్పందించాడు. శివాజీని తిట్టడం వల్ల అతని మీద నెగిటివిటీ పెరిగిపోయింది.
చాలామంది సబ్స్క్రైబర్లు ఆయన ఛానల్ ని ఆన్ సబ్స్క్రయిబ్ చేస్తున్నారు. శివాజీ మాట్లాడిన మాటలతో అనసూయకు సంబంధం లేదు. యూట్యూబర్ అన్వేష్ కూడా వాళ్ల మధ్యలో జోక్యం చేసుకోవడం వల్ల తన క్రెడిబులిటీని పోగొట్టుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో తీవ్రమైన విమర్శలను కూడా మూట గట్టుకుంటున్నాడు… ఇక ఈ వివాదంలో చాలామంది శివాజీ వైపునే నిలబడి అతనికి సపోర్ట్ చేస్తుండటం విశేషం…