
Rajinikanth Daughter Aishwarya: సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. తమిళ ప్రముఖ హీరో ధనుష్ మాజీ సతీమణి అయిన ఐశ్వర్యకు చెందిన ఓ ఆభరణంతో పాటు కొన్ని డైమండ్ కలిగిన వస్తువులు కనిపించడం లేదని చెన్నైలోని తెయాన్ మెట్ పోలీసులకు తాజా ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పనిచేసే వారిపైనే అనుమానాలున్నాయని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. తమిళ సినీ ప్రియులు ఆరాధ్య దైవంగా భావించే స్టార్ హీరో కూతురు ఇంట్లో భారీ చోరీ జరగడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
తెయాన్ మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐశ్యర్యకు చెందిన 60 సవర్ల బంగారం (480 గ్రాములు)తో పాటు డైమండ్ సెట్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు దొంగతనం జరిగినట్లు పేర్కొన్నారు. ఈనెల 18న లాకర్ తెరిచి చూడగా అందులో ఇవి లేవని ఐశ్వర్య పోలీసులకు తెలిపారు. 2019లో తన సోదరి సౌందర్ వివాహ వేడుకలో వీటిని ధరించినట్లు పేర్కొన్నారు. తన ఇంట్లో పనిచేసే వారిపైనే అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలపడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు తెలుస్తోంది.
ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలాప్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో లాకర్ ను పలు ఇళ్లకు మార్చినట్లు తెలుస్తోంది. అమె ఇంట్లో ఎక్కువగా లేకపోవడంతో ఈ చోరీ జరిగిందని అనుకుంటున్నారు. చివరికి ఆ లాకర్ 2022 ఏప్రిల్ లో పోయస్ గార్డెన్ లో ని తన నివాసారికి మార్చినట్లు ఐశ్వర్య తెలిపింది. ఇక ఐశ్యర్య స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య . కొన్ని కారణాల వల్ల వీరు దూరంగా ఉంటున్నారు.

ఇక ఈ దొంగతనం గురించి రజనీకాంత్ ఏం మాట్లాడుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరో కూతురు అయినందున పోలీసులు ఈ కేసులు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టిన వారు త్వరలోనే కేసును కొలిక్కి తీసుకొచ్చేదిశగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఐశ్వర్య ఆరోపిస్తున్నట్లు ఈ చోరికి పాల్పడింది తన ఇంట్లో పనిమనుషులా? లేక ఇతరులా? అనేది తెలియాల్సి ఉంది.