
Meena Daughter Speech: నటిగా మీనా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలుపెట్టిన మీనా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సౌత్ ఇండియాలో తిరుగులేని నటిగా వందల చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో మీనా స్టార్డం అనుభవించారు. ఈ క్రమంలో కోలీవుడ్ ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. రజినీకాంత్ తో పాటు పలువురు కోలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేదికపై మీనా కూతురు నైనిక అమ్మ గురించి మాట్లాడిన ఓ వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో నైనిక ముద్దుముద్దుగా మాట్లాడారు.
అమ్మ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను నిన్ను సంతోషంగా చూసుకుంటాను. నాన్న చనిపోయాక నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళావు. నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. నువ్వు ఎల్లవేళలా నన్ను సురక్షితంగా చూసుకున్నావు. ఒకసారి నీకు చెప్పకుండా పక్క షాపుకి వెళ్లి చాక్లెట్స్ తిన్నాను. అప్పుడు నువ్వు ఎంత భయపడ్డావో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు అమ్మ గురించి తప్పుడు వార్తలు రాశాయి. మా అమ్మ కూడా మనిషే. ఆమెకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి అలా రాయకండి… నైనిక ఆ వీడియోలో అన్నారు.
నైనిక తన మాటలతో రజినీకాంత్ తో పాటు పలువురుని ఎమోషనల్ అయ్యేలా చేసింది. 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విద్యా సాగర్ ని మీనా వివాహం చేసుకున్నారు. గత ఏడాది ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. భర్త మరణం మీనాను దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం మీనా రెండో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు మీనాను బాధ పెట్టినట్లు కూతురు నైనిక మాటలతో అర్థం అవుతుంది.
ఇటీవల మీనా పలు చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ ఆమె సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ స్థాయి పాత్రలు చేయడం విశేషం. దృశ్యం మలయాళ, తెలుగు సిరీస్లలో ఆమె నటించారు. మోహన్ లాల్, వెంకటేష్ లతో జతకట్టారు. అన్నాత్తే చిత్రంలో రజినీకాంత్ పక్కన తళుక్కున మెరిశారు. గత ఏడాది మీనా నటించిన బ్రో డాడీ, సన్ ఆఫ్ ఇండియా చిత్రాలు విడుదలయ్యాయి.
அம்மா வந்து ஒரு Heroine ah இருக்கலாம்.. ஆனா உங்கள மாதிரி ஒரு Human தான்.. அவங்களுக்கும் Feelings இருக்கு 🥲❤️❤️ #meena #nainika #meena40 #ladysuperstar #மீனா pic.twitter.com/rYZA4Avrk2
— Kamala மீனா (@MeenaNavy) April 22, 2023