Sunny Deol and Dimple Kapadia : డింపుల్ కపాడియా 80లలో కుర్రాళ్ళ కలల రాణిగా వెలిగిపోయారు. అతి తక్కువ ప్రాయంలో పరిశ్రమలో అడుగుపెట్టిన డింపుల్ మొదటి చిత్రం బాబీ. ఈ చిత్రంతో రిషి కపూర్ హీరోగా పరిచయమయ్యారు. మొదటి చిత్రానికే డింపుల్ కపాడియా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. అప్పటి టాప్ స్టార్ రాజేష్ ఖన్నాను డింపుల్ కపాడియా ప్రేమ వివాహం చేసుకున్నారు. 1973లో రాజేష్ ఖన్నా-డింపుల్ వివాహం జరిగింది. అయితే మనస్పర్థలతో విడిపోయారు.
వీరికి ఇద్దరు అమ్మాయి ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా. ఇద్దరూ హీరోయిన్స్ గా పరిశ్రమకు పరిచయమయ్యారు. ట్వింకిల్ ఖన్నాను హీరో అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్నారు. డింపుల్ కపాడియా ప్రసుత్తం స్టార్స్ చిత్రాల్లో కీలక రోల్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర, పఠాన్ వంటి పాన్ ఇండియా చిత్రాల్లో ఆమె నటించారు. 65 ఏళ్ల డింపుల్ కపాడియా ఈ వయసులో కూడా ఎఫైర్స్ నడుపుతున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
ఓవర్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. నటుడు సన్నీ డియోల్-డింపుల్ కపాడియా ఇప్పటికీ రిలేషన్ లో ఉన్నారు. జుహూలో వీరికి ఓ ఫ్లాట్ ఉంటుంది. అక్కడ తరచుగా కలుస్తూ ఉంటారంటూ ట్వీట్ చేశాడు. డింపుల్ కపాడియా గతంలో సన్నీ డియోల్ తో సహజీవనం చేసిన నేపథ్యంలో ఉమర్ సంధు ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
సన్నీ డియోల్-డింపుల్ కపాడియా పలు చిత్రాల్లో జంటగా నటించారు. అర్జున్, మంజిల్ మంజిల్, ఆగ్ గా గోల, గున, నరసింహ చిత్రాల్లో జతకట్టారు. ఈ క్రమంలో వారిద్దరూ దగ్గరయ్యారు. డింపుల్ కపాడియాను సన్నీ డియోల్ రహస్యంగా వివాహం చేసుకున్నాడనే ఓ రూమర్ ఉంది. పలు ప్రైవేట్ పోటీల్లో వీరిద్దరూ కలిసి పాల్గొనేవారట. అప్పుడు డింపుల్ కపాడియాను తన భార్యగా పరిచయం చేసేవాడట. వయసు మీద పడ్డాక కూడా వీరి బంధం కొనసాగుతుంది అంటూ… ఉమర్ సంధు సోషల్ మీడియా వేదికగా ఆరోపించాడు.
#DimpleKapadia and #SunnyDeol still in relationship. They even meet with each other in Juhu Flat. They bought flat together for their personal hangouts 🔥
— Umair Sandhu (@UmairSandu) April 14, 2023