
Sukumar- Karthik Varma Dandu: సాయిధరమ్ తేజ్ హీరో గా కార్తీక్ దండు అనే నూతన దర్శకుడు తీసిన ‘విరూపాక్ష’ చిత్రం ఈ నెల 21 వ తారీఖున పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. హీరో, హీరోయిన్ ,డైరెక్టర్ మరియు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు కథ అందించిన సుకుమార్ తదితరులు అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా సుకుమార్ మాట్లాడుతూ ‘కార్తీక్ ఈ సినిమాకి ముందు నాకు ఒక కథ చెప్పాడు, ఆ కథ నాకు నచ్చలేదు కానీ, కార్తీక్ కథ చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. వేరే కథతో రా, సినిమా చేద్దాము అని చెప్పాను. అప్పుడు ఆయన విరూపాక్ష కథతో నా దగ్గరకి వచ్చాడు, తొలి సిట్టింగ్ లోనే నాకు ఎంతగానో నచ్చింది.హీరో మరియు నిర్మాతగా కి స్టోరీ వినిపించి కథ ఓకే చేయించుకున్నాడు’.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ చెప్పినప్పుడు కార్తీక్ తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతూ ఉన్నాడు. అతని ఆయుష్షు చాలా తక్కువ, ప్రతీ రోజు స్టెరాయిడ్స్ ఎక్కించుకుంటే కానీ అతని జీవితం జరగదు.అలాంటి పరిస్థితి లో ఆయన ఈ సినిమా స్టోరీ తో మన ముందుకు వచ్చాడు, ఎన్నో కష్టాలను పడి ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు. ఈమధ్యనే నేను సినిమా చూసాను, అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అంటూ సుకుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు A సర్టిఫికేట్ ఇచ్చారు. హారర్ థ్రిల్లర్ కాబట్టే A సర్టిఫికేట్ ఇచ్చారని, ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుందని మూవీ యూనిట్ చెప్తున్న మాట.