BJP Janasena : ఊహాగానాలకు తెరపడింది. ఏపీలో జనసేనతో కలిసి వెళతామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. గుంటూరు లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తో కలిసి పోటీ చేయబోతున్నాం.. పవన్ కళ్యాణ్ ఇప్పటికే జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిశారు..త్వరలోనే రోడ్ మ్యాప్ జేపీ నడ్డా ప్రకటిస్తారని సోము వీర్రాజు తెలిపారు.
జనసేన, బీజేపీ ఒక వేదికపైకి రాకపోవడం వ్యూహమేనంటూ తమ గేమ్ ప్లాన్ ను సోము వీర్రాజు బయటపెట్టారు. రెండు పార్టీలు ఇప్పుడు విడివిడిగా పోరాటం చేసినా వచ్చేసారి కలిసి సాగుతామంటూ ప్రకటించారు.
అమరావతిలో కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను లెక్క చేయకుండా ఇసుక తరలింపు జరుగుతుందని సోము వీర్రాజు ఆరోపించారు. అడ్డు కోబోయిన బీజేపీ రాష్ట్ర నాయకులపై దాడులు చేసారని.. ఇంతవరకు కేసులు పెట్టకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే బీజేపీ నాయకులపై దాడులు చేసిన వారిపై కేసులు కట్టాలని డిమాండ్ చేస్తున్నట్టు సోము వీర్రాజు తెలిపారు.
విజయవాడ లో థర్మల్ పవర్ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే బూడిద ను 1985 నుండి స్థానికులు సేకరించి అమ్ముకునేవారని.. ఈ ప్రభుత్వం వచ్చాక కొందరు అధికారపార్టీ నాయకులు అమ్ముకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు..
పులివెందుల విషయంలో కానీ, ఢిల్లీ కేజ్రీవాల్ విషయంలో కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని.. దోషులకు శిక్ష పడకతప్పదని పేర్కొన్నారు.