Sunil And Trivikram: ఫిలిం ఇండస్ట్రీ లో స్నేహానికి మారుపేరు లాగ నిలిచిన సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారు..వారిలో మనం సునీల్ – త్రివిక్రమ్ స్నేహం గురించి మాట్లాడుకోక తప్పదు..ఇండస్ట్రీ లో స్థిరపడుదామని ఒకేసారి భీమవరం నుండి హైదరాబాద్ వచ్చిన వీళ్లిద్దరు నేడు ఇండస్ట్రీ లో ఎంత ఉన్నత స్థానం లో కొనసాగుతున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..సునీల్ కమెడియన్ గా , హీరో గా మరియు విలన్ గా అన్నిట్లో సక్సెస్ లను చూసాడు.

అలాంటి అరుదైన అవకాశం ఇండస్ట్రీ లో ప్రతిఒక్కరికి రాదు..ఇక స్టోరీ రైటర్ గా కెరీర్ ని ఆరంభించిన త్రివిక్రమ్..నేడు స్టార్ డైరెక్టర్ గా టాలీవుడ్ టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచాడు..అయితే వీళ్లిద్దరికీ అవకాశాలు అంత తేలికగా రాలేదు..ఎన్నో కష్టాలు పడ్డారు..ఇద్దరు ఒకేరూమ్ లో ఉండేవారు..ఆకలి తో కడుపు మాడ్చుకొని బ్రతికిన రోజులవి..ఒకేసారి కెరీర్ లో స్థిరపడుదామని కలిసి హైదరాబాద్ కి వచ్చిన వీళ్లిద్దరు..ఒకే సమయం లో కెరీర్ ని తాము కోరుకున్న విధంగా మలుచుకోవడం లో సఫలం అయ్యారు.
మరో గమ్మత్తు ఏమిటంటే వీళ్లిద్దరు ఒకేరోజు పెళ్లి చేసుకున్నారు కూడా..ఈ విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు..సునీల్ మరియు త్రివిక్రమ్ కూడా ఎన్నడూ ఏ ఇంటర్వ్యూ లో కూడా ఈ విషయం చెప్పలేదు..కానీ అప్పట్లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు పేపర్స్ లో వచ్చిన వార్త క్లిప్పింగ్ ని సోషల్ మీడియా లో ఒక ప్రముఖ పాత్రికేయుడు తెలపగా అందరికి తెలిసింది..శ్రీనగర్ కాలనీ లో శ్రీ సత్య నిగమం లో ప్రముఖ గేయ రచయితా సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారి సోదరుడి కుమార్తె సాయి సౌజన్య తో త్రివిక్రమ్ వివాహం జరగగా..శిల్పారామం లోని సైబర్ గార్డెన్స్ లో శృతి అనే అమ్మాయితో సునీల్ పెళ్లి ఘనంగా జరిగింది.

సునీల్ కి ఇద్దరు పిల్లలు ఉండగా , త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు..వీళ్ళు కూడా మంచి స్నేహితులు అని తెలుస్తుంది..అలా ఒకేసారి ఇండస్ట్రీ లో స్థిరపడుదామని వచ్చిన ఈ ఇద్దరు మిత్రులు నేడు తాము కన్న కలలను నెరవేర్చకొని కష్టపడితే సాధించలేనిది అంటూ ఏమి లేదని నిరూపించారు.