
Sukumar On Srikanth Odela: ఒక సినిమాకు ప్రాణం పోసేవారిలో మెయిన్ గా ఉండేది డైరెక్టర్ మాత్రమే. తన ఆలోచనలతో సినిమాకు పనిచేసేవారితో పాటు ప్రేక్షకులను మెప్పించే బాధ్యత ఆయన మాత్రమే తీసుకుంటారు. ఈ క్రమంలో ఆయన ఆలోచనలు ఒక్కోసారి సక్సెస్ కావొచ్చు.. ఫెయిల్ కావొచ్చు..కానీ ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకునే డైరెక్టర్లు అరుదుగానే ఉంటారు. అలాంటి వారిలో సుకుమార్ శిష్యులు ఇద్దరూ నిరూపించుకున్నారు. వారిలో బుచ్చిబాబు తీసిన ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన ‘దసరా’ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే శ్రీకాంత్ ఫ్యూచర్లో బిగ్ డైరెక్టర్ అవుతాడన్న విషయాన్ని సుకుమార్ 5 ఏళ్ల ముందే చెప్పాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
2018 సుకుమార్ మదిలో నుంచి వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్. రాంచరన్ హీరోగా నటించిన ఈ మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సుకుమార్ కొన్ని ఆసక్తి విషయాలు చెప్పారు. తాను పేరుకే డైరెక్టర్ అని తన వెనుక ఓ టీం ఉంటుందని, వారికి కోఆర్డినేటర్ గా మాత్రమే పనిచేస్తానని చెప్పాడు. వారితోనే నేను మంచి సినిమా తీయగలనని కొంతమంది గురించి చెప్పాడు. వీరిలో శ్రీకాంత్ ఓదెల కూడా ఉండడం విశేషం.
ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల గురించి సుకుమార్ కొన్ని విషయాలు చెప్పారు. ‘శ్రీకాంత్ ది మామూలు టాలెంట్ కాదు. ఆయన నాతో.. సర్ మీరు ఒకేసారి వెయ్యి మందిని మేనేజ్ చేస్తున్నారు.. మీరు మామూలోళ్లు కాదు సార్.. అని అన్నారు. కానీ ఆయన మాత్రం ఒకేసారి 100 మందికి కాస్ట్యూమ్ వేయగల సత్తా ఉన్న వ్యక్తి. ఉరుకులు, పరుగులు పెడుతూ కష్టపడి చేసే వ్యక్తి ఆయన కృషి ఈ సినిమాకు ఎంతో ఉంది.’ అని శ్రీకాంత్ గురించి సుకుమార్ చెప్పారు.

2018 నాటి వీడియోను బయటకు తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ‘దసరా’ సినిమా రిలీజ్ సందర్భగా శ్రీకాంత్ ఓదెలను సుకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయనకు గురువు అయినందుకు గర్వంగా ఉందని సుకుమార్ చెప్పాడు. అలా శ్రీకాంత్ ఓదెల గురించి గురువు ముందే చెప్పడంపై ఇండస్ట్రీలో ఆయన గురించి తీవ్రంగా చెప్పుకుంటున్నారు.