Gaalodu Collections: కథా, కథనం ఇలా అన్నీ కూడా నాసిరకం గా ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా ఎందుకు నిలుస్తాయో ట్రేడ్ పండితులకు కూడా అంతు చిక్కదు..అలాంటి సినిమాలలో ఒకటి సుడిగాలి సుధీర్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గాలోడు’..టీజర్ మరియు ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా ఎంత నాసిరకంగా ఉంటుంది అనేది సగటు ప్రేక్షకుడు ఊహించగలడు.

అలాంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ దగ్గర నుండి ఫుల్ రన్ వరుకు అదిరిపొయ్యే కలెక్షన్స్ ని రాబట్టి కేవలం నాలుగు రోజుల్లోనే సూపర్ హిట్ అవ్వడం అనేది ఎవరికీ అర్థం కావడం లేదు..మార్కెట్ లో సుడిగాలి సుధీర్ కి ఇంత క్రేజ్ ఉందా అని ట్రేడ్ విశ్లేషకులు సైతం షాక్ కి గురి అవుతున్నారు..ఇన్ని రోజులు యూట్యూబ్ వీడియోస్ క్రింద కామెంట్స్ లో సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి అది కేవలం బుల్లితెర కి మాత్రమే పరిమితం అని అనుకున్నోళ్ల నోర్లను మూయించాడు సుధీర్.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది..ప్రింట్ ఖర్చులు మరియు పబ్లిసిటీ మెటీరియల్ ఇలా అన్నీ కలిపి 3 కోట్ల రూపాయలకు టోటల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది..ఈ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో 90 శాతం రికవరీ మొదటి మూడు రోజుల్లోనే జరిగిపోయింది..మొదటి మూడు రోజులకు కలిపి ఈ సినిమాకి సుమారు రెండు కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..బీలో యావరేజి టాక్ వచ్చిన ఒక మాములు సినిమాకి ఈ స్థాయి వసూళ్లు అంటే అది కేవలం సుడిగాలి సుధీర్ క్రేజ్ వల్లే అని చెప్పొచ్చు.

ఇక నాల్గవ రోజు అనగా వీక్ డే కూడా ఈ సినిమాకి 80 లక్షలకు పైగా గ్రాస్ మరియు 40 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..అలా కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టేసింది..అలా టాక్ లేని సినిమాకే సుధీర్ ఈ స్థాయి వసూళ్లను రాబడితే, పొరపాటున ఆయన మంచి స్క్రిప్ట్ తో వస్తే కచ్చితంగా 20 కోట్ల రేంజ్ వసూళ్లను రాబడుతాడని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.