Street Food Health Problems: చిరుతిళ్లకు కనెక్ట్ కాని ఎవరుంటారు? రోడ్డు పక్కన బండ్ల మీద కనిపించే మిర్చి, బజ్జీ, సమోస వంటి వంటకాలను చూసి నోరూరుతుంది. వాటిని తినాలనే ఆశ ఎక్కువవుతుంది. వీటి వల్ల అనారోగ్యమని తెలిసినా ఎవరు పట్టించుకోరు. ఒకసారి తింటే ఏమవుతుందనే వాదన కూడా చేస్తారు. కానీ దీని వల్ల ఎంత ప్రమాదమని చెబుతున్నా నిర్లక్ష్యంతోనే ఉంటారు. జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక నోటికి పనిచెప్పి తింటుంటారు. దీని వల్ల మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమని వైద్యులు సూచిస్తున్నారు.

రోడ్ల పక్కన మిర్చిలు చేసే వారు వాడిన నూనెనే మళ్లీ వాడతారు. దీంతో ఒకసారి వేడి చేసిన నూనెను మళ్లీ వేడి చేస్తే రంగు మారుతుంది. క్యాన్సర్ కారకాలు ప్రవేశిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. కానీ ఇవేవీ ఆలోచించరు. దొరికింది కదా అని గబగబ లాగేయడమే. నాలుకకు పని చెప్పి ఇష్టంగా తింటారు. నూనెలోని పోషకాలు పోవడం వల్ల నూనె కలుషితంగా మారుతుంది. మళ్లీ మళ్లీ వేడి చేస్తూ తమ ఇష్టానుసారంగా నూనె వాడుతుంటారు. క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల శరీరంలో కొవ్వులు పెరిగి గుండె జబ్బు రావడం జరుగుతుంది.
నూనెను ఒకసారి వాడితే మరోసారి దాన్ని పక్కన పెట్టేయడమే ఉత్తమం. మన ఇంట్లో అయితే మన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాం. కానీ అక్కడ వారు చేసేదే మనం తినాలి. దీంతో నూనె కలుషితంగా మారి మనకు కష్టాలు తెస్తుంది. దీంతో చేసిన తినుబండారాలు తింటే మనకు కచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. పదేపదే ఇలాంటి ఫుడ్స్ తింటే గుండెలోని ధమనుల్లో కొవ్వు పెరిగి గుండె జబ్బులకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. రోడ్డు పక్కన చేసే వాటిని తినకుండా ఉంటేనే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని గ్రహించుకోవాలి.

విషయం తెలిసినా లెక్కచేయడం లేదు. రోడ్డుపక్కన లభించే వాటి కోసమే ఆకర్షితులు అవుతున్నారు. ఏముంది అందులో మనం ఇంటిలో చేసుకుంటే తినొచ్చు కదా. రోడ్డు పక్కన అయితే రెడీమేడ్ గా ఉంటాయి. అక్కడే నిలబడి లాగించేసి మన పనికి మనం వెళ్లొచ్చనే భావన అందరిలో ఉంటుంది. కానీ రోడ్డు పక్కన అమ్మే బజ్జీల బండ్లను ఆశ్రయించకుండా మన ఇంట్లోనే సురక్షితంగా చేసుకున్న వంటకాలను హాయిగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.