Bigg Boss 6 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ మొత్తం ఫన్ తో నిండిపోయింది..నామినేషన్స్ ప్రక్రియ సైతం ఈ వారం చాలా ప్రశాంతమైన వాతారవరణం లో జరగడం విశేషం..ఇక ఈ వీక్ లో కెప్టెన్సీ టాస్కుకి బదులుగా ‘బిగ్ బాస్ కోచింగ్ సెంటర్’ అనే టాస్కుని ఏర్పాటు చేసాడు బిగ్ బాస్..ఈ టాస్కులో ఆది రెడ్డి డాన్స్ మాస్టర్ గా, శ్రీ సత్య మేకప్ మాస్టర్ గా, రాజ్ సింగర్ గా ఇంటి సభ్యులకు టీచింగ్ ఇవ్వాలి..బెల్ కొట్టిన ప్రతీసారి బిగ్ బాస్ ఇచ్చిన మాస్టర్ రోల్స్ ని విజయవంతంగా పూర్తి చెయ్యాలి.

ఈ టాస్కు మొత్తం చాలా ఫన్నీ గా కొనసాగిపోతుంది..ఇంతలో ఆది రెడ్డి భార్య కవిత మరియు అతని కూతురు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడతారు..వాళ్లిద్దరూ హౌస్ లోకి అడుగుపెట్టగానే ఆది రెడ్డి మొహం లో ఒక వెలుగు కనిపిస్తుంది..చాలా రోజుల తర్వాత తన కూతురు మరియు భార్య ని చూసేసరికి ఆదిరెడ్డి బాగా ఎమోషనల్ అయిపోతాడు.
ఇక ఆది రెడ్డి కూతురుతో ఇంటి సభ్యులందరు కాసేపు ముచ్చట్లు ఆడుతారు..ఆది రెడ్డి భార్య కవిత కూడా అందరితో కలిసిపోయి సరదాగా కాసేపు మాట్లాడింది..ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఆది రెడ్డి కూతురు మొట్టమొదటి పుట్టినరోజు కోసం ఒక సర్ప్రైజ్ కేక్ ని పంపుతాడు..అది చూసి ఆది రెడ్డి ఎంతో సంతోషిస్తాడు..ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన నాకు ఈరోజు నా కుటుంబం ని కోట్లాదిమంది ప్రేక్షకులకు చూపించే ఛాన్స్ దక్కింది.

నా కూతురు మొదటి పుట్టినరోజు సంబరాలను కోట్లాదిమంది వీక్షించారు..ఇంతకు మించి నేను సాధించాల్సిందే ఏముంది..లవ్ యు బిగ్ బాస్ అంటూ ఎమోషనల్ అవుతాడు ఆది రెడ్డి..ఇక ఆది రెడ్డి ఫామిలీ ని చూసి తమ ఫ్యామిలీస్ ని మిస్ అవుతున్నామని రేవంత్, కీర్తి మరియు రోహిత్ బాధపడుతారు..అలా బిగ్ బాస్ హౌస్ ఈరోజు కాసేపు ఫన్ తో మరికాసేపు ఎమోషనల్ గా కొనసాగిపోయింది.