
జీవితంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. పొట్టకూటి కోసం డబ్బు సంపాదించాలని కష్టపడే వారు కోకొల్లలు. డబ్బు లేక మన దేశంలో ఆకలి బాధతో అలమటించి చనిపోయిన వారు వందల సంఖ్యలో ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గొడ్డు చాకిరీ చేసినా చాలామందికి సకాలంలో ఆదాయం చేతికి అందదు. అయితే అదృష్టం అనేది ఎవరిని ఏ విధంగా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు.
Also Read : అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతి మహిళ
కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా పేదవాళ్లు సైతం కోటీశ్వరులు అవుతూ ఉంటారు. తాజాగా ఒక వ్యక్తి చేసిన పని అతనికి కోట్ల రూపాయలు సొంతమయ్యేలా చేసింది. అమెరికాలోని వర్జీనియాకు చెందిన వ్యక్తి వర్షం వల్ల రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. గార్లండ్ హ్యారీసన్ అనే వ్యక్తి వర్జీనియాలోని పీటర్స్‌బర్గ్ ప్రాంతానికి చెందిన వాడు. ఆ వ్యక్తి పని మీద బయటకు వచ్చిన సమయంలో వర్షం మొదలైంది.
వర్షం అంతకంతకూ ఎక్కువ కావడంతో ఆ వ్యక్తి సమీపంలోని షాపింగ్ మాల్ కు వెళ్లాడు. అక్కడ సరదాగా ఒక లాటరీ టికెట్ ను కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిపోయాడు. లాటరీ ఫలితాలు వచ్చిన తరువాత హ్యారీసన్ టికెట్ కే నగదు బహుమతి రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే అధికారులను సంప్రదించి లాటరీ డబ్బులను తీసుకుని హ్యారిసన్ ఇంటికి వచ్చాడు. హ్యారిసన్ మీడియాతో మాట్లాడుతూ అంత డబ్బు గెలుచుకోవడం సంతోషంగా ఉందని ఆ డబ్బును ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేం కదా…?
Also Read : ఆ గ్రహశకలం భూమిని తాకితే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే…?