
కరోనా మహమ్మారి ‘లెజండరీ సింగర్ సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ అభిమానులను రోజుకొక రకంగా గందరగోళంలో పడేస్తోంది. రెండు రోజుల క్రితం బాలుగారి ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. మొన్న మాత్రం ఆయన ఆరోగ్యం బాగుందని.. బాలుగారికి వెంటిలేషన్ తొలిగించారని.. ఆయన ఆరోగ్యం పై డాక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని.. రోజురోజుకు అన్నయ్య ఆరోగ్యం కుదటపడుతూ ఉందని.. బాలుగారు చెల్లెలు ఎస్పీ శైలజగారు మొన్న స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ నిన్న సాయంత్రం నుండి మళ్ళీ బాలుగారి ఆరోగ్యం విషమంగా ఉందట.
Also Read: పాపం ఖుష్బూ.. కంటికి కత్తి తగిలి గాయం
చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రి నిర్వాహకులు బాలుగారి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తూ.. ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారా బాలుగారు శ్వాస పీల్చుకుంటున్నారని, ఆయనకు ప్రత్యేకంగా ఎక్మో పరికరం అమర్చి చికిత్స కొనసాగిస్తున్నామని ఆస్పత్రి వైద్యసేవల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనూరాధ భాస్కరన్ బుధవారం సాయంత్రం స్పష్టం చేశారు. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ అభిమానులంతా మళ్ళీ తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. నిన్న సాయంత్రం విడుదల చేసిన అప్ డేట్ అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. మొన్న సాయంత్రమే కదా.. బాలుగారు ఆరోగ్యం కుదుటపడిందని, తరచూ స్పృహలోకి వస్తున్నారని, మరికొద్ది రోజుల చికిత్స తర్వాత ఆయన పూర్తిగా కోలుకుంటారని.. బాలుగారి సిస్టర్ శైలజగారు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ స్పష్టం చేశారు.
Also Read: అయ్యో.. పాపం బాలయ్య.. !
మళ్ళీ అంతలోనే ఏమైందని భయపడుతూ.. తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్ధనలు చేస్తున్నారు. 30మంది హిజ్రాలు బాలుగారు ఉన్న ఆస్పత్రి ఎదుట ప్రార్థనలు చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. అలాగే బాలు గారు త్వరగా కోలుకోవాలని తమిళ స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్ తో పాటు లెంజడరీ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రహ్మాన్, సినీ గేయరచయిత వైరముత్తు సహా పలువురు సినీ ప్రముఖులు గురువారం సాయంత్రం 6గంటలకు సామూహిక ప్రార్థనలు నిర్వహించారట. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు భారతిరాజా బయట పెట్టారు.