
Asaduddin Owaisi: వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన కామెంట్స్‌తో తరచూ వార్తల్లో ఉండే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని ఆయన ఇంటిపై దుండగులు ఆదివారం రాత్రి దాడిచేశారు. దీనిపై ఎంపీ పార్లమెంట్ స్ట్రీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తన సమాజిక వర్గంపై దాడిచేస్తేనే ప్రతిదాడికి పురిగొల్పే ఎంపీ.. తాజా దాడితో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆయన సామాజికవర్గం నేతలు ఎలా రియాక్ట్ అవుతారో అన్న టెన్షన్ నెలకొంది. ఈ దాడివెనుక ఎవరు ఉన్నారన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. ఐతే.. వాళ్లెవరు, ఎందుకు ఇలా చేశారన్నది తెలియలేదు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
ఆదివారం రాత్రి ఇంట్లోల ఎవరూ లేని సమయంలో దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటే తీవ్ర నష్టం జరిగేదని ఎంపీ పేర్కొన్నాడు. ఈమేరకు ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తాను రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర రాళ్లు విసిరినట్లుగా ఉందని ఫిర్యాదులో వెల్లడించాడు.
ఎంపీ ఇంటిని పరిశీలించిన పోలీసులు..
అసద్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు ఎంపీ ఇంటిని పరిశీలించారు. అడిషనల్ డీసీపీ.. ఆ ఇంటికి వెళ్లారు. అన్నీ గమనించారు. అక్కడ విసిరిన రాళ్లను ఆధారాలుగా సేకరించారు. ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలిస్తున్నారు. దుండగుల్ని కనిపెట్టేందుకు సీసీటీవీ ఫుటేజ్‌తోపాటూ.. ఫోరెన్సిక్ ఆధారాలు కీలకం కానున్నాయి.

పాత నేరస్థుల పనేనా..
అయితే ఎంపీ ఇంటిపై దాడి పాత నేరస్థుల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు రాళ్లలపై ఉన్న ఫింగర్ ప్రింట్స్‌ను పాత నేరస్థుల ఫింగర్ ప్రింట్స్‌తో, సీసీ టీవీ ఫుటేజీల్లో దృశ్యాలను పాత నేరస్తుల ఫొటోలతో పోల్చి చూస్తున్నారు. ఒక్క నేరస్థుడి వివరాలు సరిపోలినా.. అతన్ని పట్టుకొని.. మిగతా వాళ్లను కూడా కనిపెట్టవచ్చు. పోలీసులు అదే పనిలో ఉన్నారు.
ఎందుకు దాడి చేసినట్లు..
అసదుద్దీన్ ఇటీవల ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా హిందువులపై ఎలాంటి విమర్శలు కానీ, కించపరిచే వ్యాఖ్యలు కానీ చేయలేదు. అయితే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన స్ట్రీల్ కార్నర్ మీటింగ్‌పై ఆ పార్టీ కార్పొరేటర్, ఆయన అనుచరులు దాడిచేశారు. మహిళలను దుర్భాషలాడారు. ఈ వషయమై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. హైదరాబాద్‌లో ఎంఐఎం కార్పొరేటర్ దాడికి ఢిల్లీలో ఆ పార్టీ అధినేత ఇంటిపై దాడికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
మొత్తానికి అసద్ ఇంటిపై దాడి ఇటు హైదరాబాద్‌లో, అటు ఢిల్లీలో కలకలం రేపింది. ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితులు దొరికితేనే దాడికి కారణాలు తెలిసే అవకాశం ఉంది.