Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy- Balakrishna: విజయసాయికి మాటిచ్చిన బాలయ్య!

Vijayasai Reddy- Balakrishna: విజయసాయికి మాటిచ్చిన బాలయ్య!

Vijayasai Reddy- Balakrishna
Vijayasai Reddy- Balakrishna

Vijayasai Reddy- Balakrishna: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న మరణం ఇటు సినిమా ఇండ్రస్ట్రీతోపాటు, అటు రాజకీయ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. తారకరత్నకు పార్టీలకు అతీతంగా అందరూ నివాళులర్పిస్తున్నారు. తారకరత్న మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు.. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నటుడిగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే అవుదానుమకున్న తరుణంలో ఆయన లేరనే వార్త టీడీపీని కుదిపేస్తోంది. తారకరత్న మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ప్రముఖుల నివాళి..
అందరి వాడు అయిన తారకరత్నకు చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ తదితరులు నివాళులర్పించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు కూడా తారకరత్న ఇంటకి వచ్చి కడసారి చూసుకున్నారు.

బాధ్యత తీసుకున్న బాలయ్య..
సినీ నటుడు, హీరో బాలకృష్ణ సోదరుడి కుమారుడు అయిన తారకరత్న మరణం బాలయ్యను తీవ్రంగా కలచివేసింది. తారక్‌ మృతదేహం వద్ద బాలయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. తారక్‌ తనను బాలబాబు అని పిలిచేవాడు అని తలుచుకుంటూ, ఆ పిలుపుకు దూరమయ్యాను అంటూ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తనదేనని బాలకృష్ణ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాటిచ్చారు. ఈ విషయాన్ని ఎంపీ స్వయంంగా వెల్లడించారు. అదేవిధంగా బాలయ్య నిర్ణయించిన సమయానికి తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొన్నారు. తారకరత్న మరణం తనను ఎంతగానో బాధించిందని.. సినీ రంగంలో ప్రతిఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మానసిక ఒత్తిడిలో అలేఖ్య..
తన భర్త మృతితో అలేఖ్యరెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని, తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతుందని తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఫిలిం ఛాంబర్‌ కు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం తీసుకువస్తారని, మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని వివరించారు.

Vijayasai Reddy- Balakrishna
Vijayasai Reddy- Balakrishna

అలేఖ్య ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయానా మరదలి కూతురు. విజయసాయిరెడ్డి భార్య.. తారకరత్న భార్య తల్లి అక్కాచెల్లెళ్లు. తారకరత్నకు విజయసాయిరెడ్డి మామయ్య అవుతారు. అందుకే విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular