Tank Bund: తెలంగాణకు మణిహారంగా నిలుస్తుంది హైదరాబాద్. కులీకుత్ షా కాలం నుంచి ప్రస్థానం మొదలైన ఈ నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని ప్రిసద్ధ నగరాల పక్కన హైదరాబాద్ చేరుతోంది. చదువు, పెట్టుబడులు, ఆహారం, నివాస యోగ్యాల్లోనూ హైదరాబాద్ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశం అని ప్రముఖ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. సౌత్ ఇండియాలోని బెంగుళూరు తరువాత టెక్నాలజీని సొంతం చేసుకున్న నగరంగా హైదరాబాద్ పేరే మారుమోగుతోంది. అభివృద్ధి విషయంలోనూ కాకుండా పర్యాటక ప్రదేశాల్లోనూ హైదరాబాద్ పేరెన్నికగన్నదని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడి పర్యాటక ప్రదేశాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ట్యాంక్ బండ్.
క్రీస్తుశకం 1568లో మూసీనదిపై ఓ చెరువు కట్టను నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కులీబ్ కుతుబ్ షా కాలంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా దీనిని నిర్మించారు. అయితే తనను అనారోగ్యం నుంచి కోలుకునేలా చేసిన హుస్సేన్ గౌరవార్థం ఆయన పేరును ఈ చెరువుకు హుస్సేన్ సాగర్ అని పెట్టారు. కొన్నాళ్లు నిజాం పాలనలో ఉన్న ఇది ఆ తరువాత బ్రిటివారి ఆధీనంలో కి వచ్చి కంటోన్మెంట్ కు జరిగిన రాకపోకలలలో ఒక మార్గంగా ఏర్పడింది. 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఏనుగుల వీరస్వామయ్య ఈ గట్టుపై దారిని ఏర్పాటు చేసేలా కవితల రూపంలో అందించాడు.

క్రమంగా ఈ గట్టుపై దారి ఏర్పడడంతో వాహనాల రద్దీ పెరిగింది. ఆ తరువాత హుస్సేన్ చుట్టుపక్కల భవనాలు, ఇండస్ట్రీలో ఏర్పడడంతో ఈ నీరు కలుషితంగా మారింది. ప్రస్తుతం ఇందులోకి మురికినీరే ఎక్కువగా ప్రవహిస్తుంది. అయితే కాలం మారుతున్న కొద్దీ హుస్సేన్ సాగర్ పర్యాటక ప్రదేశంగా విరజిల్లుతోంది. దీని చుట్టుపక్కల పార్కులు నిర్మించి ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ హయాంలో చెరువు మధ్యలో పెద్ద బుద్దుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ కు నడిబొడ్డున హుస్సేన్ సాగర్ గా పేర్కొంటారు. కొందరు సందర్శకులు పురాతన కాలంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఫొటోలు తీశారు. అప్పటి ఫొటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. అప్పటికీ, ఇప్పటికే హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నారు. ఆ పిక్స్ ను మీరూ చూసేయండి.