Hero Ash Srileela : KGF హీరో యాష్ తో రిలేషన్ షిప్ గురించి శ్రీలీల షాకింగ్ కామెంట్స్

Hero Ash Srileela : ఈ ఏడాది ఎంతోమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వచ్చారు..కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు..ఆ కొంతమందిలో ఒకరే శ్రీలీల..శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా తెరకెక్కిన పెళ్లి సందడి అనే సినిమా ద్వారా గత ఏడాది ఈమె ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..తొలిసినిమాతోనే తన అందం , నటన మరియు డ్యాన్స్ తో కుర్రకారులను పిచ్చెక్కించేసింది..ఈమెలోని అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి సినిమాల్లో అవకాశాలు వెళ్ళవలాగా వచ్చి పడుతున్నాయి. రీసెంట్ గానే […]

Written By: NARESH, Updated On : January 5, 2023 9:46 am
Follow us on

Hero Ash Srileela : ఈ ఏడాది ఎంతోమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వచ్చారు..కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు..ఆ కొంతమందిలో ఒకరే శ్రీలీల..శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా తెరకెక్కిన పెళ్లి సందడి అనే సినిమా ద్వారా గత ఏడాది ఈమె ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..తొలిసినిమాతోనే తన అందం , నటన మరియు డ్యాన్స్ తో కుర్రకారులను పిచ్చెక్కించేసింది..ఈమెలోని అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి సినిమాల్లో అవకాశాలు వెళ్ళవలాగా వచ్చి పడుతున్నాయి.

రీసెంట్ గానే ఆమె హీరోయిన్ గా నటించిన రెండవ సినిమా ధమాకా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో ఈ అమ్మాయిని చూసేందుకే ఒక సెక్షన్ ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడి మరీ వెళ్లారంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు..ఆమె వేసిన డ్యాన్స్ కి కుర్రకారులు మరియు మాస్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు..రాబొయ్యే రెండు మూడు సంవత్సరాలలో ఆమె టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇది ఇలా ఉండగా శ్రీలీల గురించి గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక ప్రచారం జోరుగా సాగుతుంది..అదేమిటి అంటే ఆమె ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ రాకింగ్ స్టార్ యాష్ కి బంధువు అవుతుందని..అతని వల్లే ఆమెకి సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చిందంటూ ఒక రూమర్ జోరుగా ప్రచారం అయ్యింది..దీనిపై శ్రీలీల రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘మా అమ్మ పెద్ద డాక్టర్..యాష్ గారి భార్య కి బిడ్డని డెలివరీ చేసింది మా అమ్మనే..అందుకే అప్పటి నుండి యాష్ కి నేను బంధువు అంటూ ప్రచారం చేసేసారు..వాస్తవానికి కాదు’ అంటూ క్లారిటీ ఇచ్చింది..శ్రీలీల ప్రస్తుతం డాక్టర్ చదువుతుంది..పెద్ద డాక్టర్ అవ్వాలనేదే ఆమె జీవిత లక్ష్యం అట ..ధమాకా మూవీ చేస్తున్నప్పుడు కూడా ఆమె పరీక్షలు రాస్తూ ఉండేదట..ఈ విషయాన్ని శ్రీలీలనే చెప్పుకొచ్చింది.