Sri Reddy- Daggubati Abhiram: టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు. సంచలనాలు, వివాదాలతో శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. లైంగికంగా వాడుకొని అవకాశాలు ఇవ్వకుండా మోసం చేసారంటూ చిన్నపాటి ఉద్యమమే చేశారు. మా సభ్యత్వం, అవకాశాల విషయమై శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అప్పట్లో ఇది నేషనల్ వైడ్ న్యూస్. తనతో అసభ్యంగా ప్రవర్తించిన నటులతో పాటు పలువురి పేర్లు శ్రీరెడ్డి బయటపెట్టారు. ఈ వివాదంలో అడ్డంగా బుక్కయ్యాడు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్.

దగ్గుబాటి అభిరామ్ తనను లైంగికంగా వాడుకున్నాడు. చాలా కాలం రిలేషన్షిప్ నడపాడని శ్రీరెడ్డి ఆరోపించారు. ఆధారాలతో సహా తన ఆరోపణలు నిరూపించే ప్రయత్నం చేశారు. అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫోటోలు శ్రీరెడ్డి విడుదల చేశారు. ఈ వివాదంపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అభిరామ్ లాగే చాలా మంది సినిమా ప్రముఖుల చీకటి బాగోతాలు నాకు తెలుసని శ్రీరెడ్డి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.
తాజాగా దగ్గుబాటి అభిరామ్ ని గుర్తు చేసుకుంది శ్రీరెడ్డి. నానక్ రామ్ గూడ ఏరియాలో గల రామానాయుడు స్టూడియోని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చేశారు. స్టూడియో పడగొట్టి అక్కడ నివాస సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఆల్రెడీ స్టూడియో కూల్చివేత కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన శ్రీరెడ్డి దారుణ కామెంట్స్ చేశారు. దగ్గుబాటి అభిరామ్ తో నా ఫస్ట్ నైట్ జరిగింది అక్కడే. ఇప్పుడు ఆ స్టూడియో కనుమరుగు కాబోతుంది అంటూ… జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.

అభిరామ్ ఏదో తాళి కట్టిన భర్త లాగా… వారి మధ్య జరిగిన శృంగారానికి శోభనం అని పేరు పెట్టి జనాలకు చెబుతుంది శ్రీరెడ్డి. దగ్గుబాటి ఫ్యామిలీ శ్రీరెడ్డి కామెంట్స్ ని పట్టించుకోవడం మానేశారు. ఇక శ్రీరెడ్డి మాటలు జనాలకు కూడా అలవాటైపోయాయి. దీంతో ఆమెను సీరియస్ గా తీసుకోవడం మానేశారు. శ్రీరెడ్డి చెన్నైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆమెకు సినిమా ఆఫర్స్ పూర్తిగా కనుమరుగయ్యాయి. ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన శ్రీరెడ్డి వంటల వీడియోలు చేస్తున్నారు.