Mohan Babu- Murali Mohan: పరిశ్రమలో మోహన్ బాబుకు ముక్కోపిగా పేరుంది. నిర్మాతగా, హీరోగా ఇతర నటులు, హీరోయిన్స్ పై ఆయన చేయి చేసుకున్నారనే వాదనలు ఉన్నాయి. ఇక మోహన్ బాబు మాటతీరు నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనే గొప్ప అని ఫీలయ్యే మోహన్ బాబు పబ్లిక్ లో సీనియర్స్, సహనటుల గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఓ సందర్భంలో మోహన్ బాబు ఏకంగా నటుడు మురళీ మోహన్ కాలర్ పట్టుకున్నాడట. ఈ విషయాన్ని మురళీ మోహన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ… నేను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సౌత్ ఇండియా స్టార్స్ తో క్రికెట్ మ్యాచెస్ నిర్వహించి ఫండ్స్ కలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. టాలీవుడ్ నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ టీమ్ కెప్టెన్స్ గా నాలుగు టీములు చేశాము. అయితే మోహన్ బాబు మా అబ్బాయి మంచు విష్ణు కూడా ఆడతాడని నాతో వచ్చి చెప్పాడు. అప్పటికి విష్ణు సినిమాల్లోకి రాలేదు. విష్ణు ఒక్క సినిమాలో కూడా నటించలేదు కదా… అలా ఆడటం కుదరదు అన్నాను. నేను అడిగినా కాదంటావా? అని మోహన్ బాబు నిలదీశారు.
రూల్ అన్నాక రూలే. సినిమాల్లో నటించని విష్ణు క్రికెట్ ఆడటానికి వీల్లేదని గట్టిగా చెప్పాను. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మోహన్ బాబు నా కాలర్ పట్టుకున్నాడు. నేను కూడా ఆయన కాలర్ పట్టుకున్నాను. మూడు రోజుల తర్వాత మోహన్ బాబు నా దగ్గరకు వచ్చి నాదే తప్పు, సారీ అని చెప్పారు, అని మురళీ మోహన్ గతంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. 2003లో విష్ణు సినిమాతో మంచు విష్ణు హీరోగా పరిచయమయ్యారు.

మంచు విష్ణును మోహన్ బాబు భారీ లాంచ్ చేశాడు. దాదాపు రూ. 28 కోట్ల బడ్జెట్ తో విష్ణు స్వయంగా నిర్మించారు. మలయాళ దర్శకుడు షాజీ కైలాష్ తెరకెక్కించిన విష్ణు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇరవై ఏళ్ల క్రితం రూ. 28 కోట్లు అంటే… ఇప్పుడు వంద కోట్లతో సినిమా చేసినట్లే లెక్క. డెబ్యూ హీరోయిన్ పై అంత పెట్టుబడి పెట్టి మోహన్ బాబు దారుణంగా నష్టపోయారు. అంత భారీగా లాంచ్ చేస్తే విష్ణు మాత్రం కనీసం టైర్ టు హీరో కూడా కాలేకపోయాడు నిజంగా వారసుల వైఫల్యం మోహన్ బాబును వెంటాడుతున్న వేదన.