https://oktelugu.com/

వైరల్ వీడియో: పాకిస్తాన్ పై భారత్ మెరుపుదాడి

గాంధీ పుట్టిన దేశం మనిది. అహింసా మార్గం మనది. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపే సహనం మనది. కానీ ఇప్పుడు బీజేపీ పాలనలో ట్రెయిన్ రివర్స్ అయ్యింది. భారత్ పై ఒక దాడి చేసి రెండు దాడులు చేసేలా కేంద్రంలో బీజేపీ సర్కార్ సై అంటోంది. ఉగ్రవాదులను ఎగదోస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ కు తాజాగా గట్టి షాకిస్తూ ఏకంగా మిసైల్స్ తో దాడి చేసింది భారత ఆర్మీ. Also Read: రాహుల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 08:57 PM IST
    Follow us on

    గాంధీ పుట్టిన దేశం మనిది. అహింసా మార్గం మనది. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపే సహనం మనది. కానీ ఇప్పుడు బీజేపీ పాలనలో ట్రెయిన్ రివర్స్ అయ్యింది. భారత్ పై ఒక దాడి చేసి రెండు దాడులు చేసేలా కేంద్రంలో బీజేపీ సర్కార్ సై అంటోంది. ఉగ్రవాదులను ఎగదోస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ కు తాజాగా గట్టి షాకిస్తూ ఏకంగా మిసైల్స్ తో దాడి చేసింది భారత ఆర్మీ.

    Also Read: రాహుల్ గాంధీ గాలితీసిన ఒబామా.. ఏమన్నాడంటే?

    నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ కు తాజాగా భారత్ షాకిచ్చింది. సరిహద్దుల్లోని దవార్, కేరన్, ఉరి, నౌగమ్ సెక్టార్లలో భారీ ఆయుధాలు, మోటర్లతో భారత సైనికులపైకి దాడులకు దిగిన పాకిస్తాన్ జవాన్లకు భారత్ ధీటుగా బదులిచ్చింది.

    తాజాగా పాకిస్తాన్ ఆయుధ సామగ్రిని కలిగిన ప్రదేశం, ఆయిల్ నిల్వల బిల్డింగ్, ఉగ్రవాదులకు సాయంగా పాక్ లాంచ్ ప్యాడ్ లను భారత ఆర్మీ మిస్సైల్స్ తో ధ్వంసం చేసింది.

    Also Read: విపత్తు సాయం: తెలంగాణకు హ్యాండిచ్చిన మోడీ

    పాకిస్తాన్ బంకర్లను భారత ఆర్మీ ధ్వంసం చేసిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. భారత ఆర్మీనే ఈ ఈవీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. ఆ వీడియోలో పాకిస్తాన్ భూభాగంలోని ఓ బంకర్ ను లక్ష్యంగా చేసుకొని భారత మిస్సైల్ దాడి చేసింది. మిస్సైల్ రావడంతో ఓ పాక్ సైనికుడు పారిపోతున్నది వీడియోలో రికార్డ్ అయ్యింది. మొత్తం మూడు మిస్సైల్స్ తో దాడి చేశారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్