Solar Eclipse: గ్రహణాలకు భారత దేశంలో ఒక ప్రత్యేకత ఉంది. కొందరు శుభ సూచకంగా భావిస్తే మరికొందరు అశుభంగా భావిస్తారు. పండితులు గ్రహణ ప్రభావం ఎవరిపై ఎంత ఉంటుందని రాశుల వారీగా విశ్లేషిస్తారు. ఇక గ్రహణాల అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటారు. ఈ క్రమంలో ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృత కాబోతోంది. ఏప్రిల్ 8న అమావాస్య సందర్భంగా సూర్య గ్రహణం ఏర్పడనుంది. 50 ఏళ్లలో ఏర్పడబోతున్న అతిపెద్ద సూర్య గ్రహణం ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అరుదైన గ్రహణం..
2024, ఏప్రిల్ 8న ఖగోళంలో అద్భుతం జరగనుంది. సంపూర్ణ సూర్యగ్రహణం అనే ఒక అరుదైన ఖగోల దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఈరకమైన ఘటనలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం సభవించినప్పుడు ఆకాశంలో కొంత సమయం చీకటిగా మారుతుంది. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీనికారణంగా సూర్యుని కిరణాలు భూమికి చేరవు.
50 ఏళ్ల తర్వాత..
ఈ సూర్యగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. గత 50 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం, భారత కాలమానం ఏప్రిల్ 8వ తేదీ అమావాస్య తిథి రాత్రి 9:12 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 1:25 వరకు కొనసాగుతుంది. అంటే గ్రహణం మొత్తం 4:39 గంటలపాటు ఉంటుంది. దీంతో ఏప్రిల్‌లో సంభవించే సూర్యగ్రహణం ఈ సవంత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి సూర్య గ్రహణం 50 ఏళ్ల క్రితం ఏర్పడిందని, మళ్లీ ఇప్పుడు చూడగలరని తెలిపారు.
భారత్‌లో కనిపించదు..
ఈ అరుదైన సూర్యగ్రహణంవ భారతదేశంలో కనిపించదు. కెనడా, మెక్సికో, ఉత్తర అమెరికా, యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, నైరుతి యూరప్ ప్రాంతాల్లో సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణానికి ముందు రోజు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు. దీంతో అతిపెద్దగా కనిపిస్తాడు.