Sofa On Wheels: సాధారణంగా మనం సోఫా సెట్ ను ఎందుకు వాడతాం? అదేంటి అదేం ప్రశ్న? కూర్చోవడానికి కదా వాడేది. అని అంటారా.. మీరు చెప్పింది నిజమే.. కానీ పుర్రెకో బుద్ధి. జిహ్వకో రుచి అన్నట్టు.. కొంతమంది ఔత్సాహికులు సోఫా సెట్ తో భారీ ప్రయోగమే చేశారు. అలాంటి ఇలాంటి ప్రయోగం కాదు.. మనుషుల్ని ఒకచోటి నుంచి మరొక చోటికి సులభంగా చేర్చే ప్రయోగం.. సారీ దాని ప్రయోగం అనకూడదేమో.. వాహనం అనాలేమో.. ఎందుకంటే వారు చేసిన ఆ ప్రయోగం ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రనే మార్చేది.. అటువంటి ఆ ప్రయోగం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ దిగజం ఆనంద్ మహీంద్రా ను ఆకట్టుకుంది. అంతేకాదు ఆ ప్రయోగాన్ని చూసి ముచ్చట పడిన అతడు వారు చేసిన దానిని ప్రపంచానికి తన ట్విట్టర్ ఎక్స్ ద్వారా పరిచయం చేశారు.
ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు ఔత్సాహిక యువకులు ఒక సోఫా సెట్ ను తీసుకున్నారు. దాని కింద కొన్ని చక్రాలు అమర్చారు. వాటికి సెన్సార్ బిగించారు. సోఫా సెట్ ను సౌకర్యవంతంగా కూర్చునేందుకు తీర్చిదిద్దారు. ఇంకేముంది అందులో కూర్చొని రిమోట్ ఆన్ చేయగానే సోఫా సెట్ ముందుకు కదలడం ప్రారంభమైంది. నునుపుగా ఉన్న రోడ్డుమీద అది పరుగులు తీయడం మొదలైంది.. చూస్తుంటే బామ్మ మాట బంగారు బాట సినిమా లోని కారు మాదిరిగా అది తెగ చక్కర్లు కొట్టింది.. తనను ఎంతగానో ఆకట్టుకున్న ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. విభిన్నమైన అంశాలను పంచుకోవడంలో ఎంతో ఉత్సాహం చూపించే ఆనంద్ మహీంద్రా ఈ ప్రయోగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరు వ్యక్తులు చేసిన సోఫా సెట్ ప్రయోగం నాకు బాగా నచ్చింది.. దాని కింద చక్రాలు అమర్చి వారు దానిని ఒక వాహనం లాగా మార్చుకున్నారు. ఎటువంటి ఇంధనం ఖర్చు లేకుండానే అది పరుగులు తీస్తోంది. ఇలాంటి ప్రయోగాలు ఆటోమొబైల్ చరిత్రను మార్చుతాయి. ఇలాంటి ప్రయోగాలు ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా అవసరం. అయితే అటువంటి వాహనం మీద వారు పరుగులు తీస్తున్నప్పుడు నేను ఒక ఆర్టీవో అధికారిని కావాలి అనుకుంటున్నాను.. వారి వాహనాన్ని ఆపినప్పుడు.. నా ముఖ కవళికలను వారు చూడాలి అనుకుంటున్నాను.. అని ఆనంద్ రాసుకొచ్చారు. ఇక ఆనంద్ పోస్ట్ చేసిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది. ఈ వీడియో చూసి కొంత మంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. మీ మహీంద్ర కంపెనీ ద్వారా ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయండి.. అవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి అంటూ ఆయనకు సలహాలు ఇచ్చారు. మరికొందరేమో ఇలాంటి వాహనాలు వస్తే పర్యావరణానికి మేలు కలుగుతుంది అంటూ వ్యాఖ్యానించారు.
Just a fun project? Yes, but look at the passion and engineering effort that went into it. If a country has to become a giant in automobiles, it needs many such ‘garage’ inventors…
Happy driving kids, and I’d like to see the look on the face of the RTO inspector in India, when… pic.twitter.com/sOLXCpebTU— anand mahindra (@anandmahindra) December 30, 2023