Social Updates: సినీ సెలబ్రెటీలు తమ రోజువారీ ముచ్చట్లను అభిమానులతో పంచుకునేందుకు ఇష్టపడుతుంటారనే సంగతి అందరికీ తెల్సిందే. ఈరోజు కూడా పలువురు స్టార్స్ సరికొత్త అప్ డేట్స్ పోస్టు చేసి అభిమానులను అలరించారు. అలాంటి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి..!

హీరోయిన్ అదా శర్మ రెండు కర్రలతో విన్యాసాలు చేస్తున్న వీడియోను ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. బ్యాక్ డ్రాప్ లో ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా’ అనే ‘పుష్ఫ’ సాంగ్ ను జోడించింది.
రకుల్ ప్రీత్ సింగ్ కు జిమ్, యోగా చేయడం అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెల్సిందే. Choose Streching Over Stressing అంటూ ఓ పిక్ ను షేర్ చేసింది. దీనికి #regainingcontrol #backontrack #2022 హ్యాష్ టాగ్ లను జోడించి అనుష్కయోగా ను అటాచ్ చేసింది.
రష్మిక మందన్న మత్తుకళ్లతో కవ్విస్తున్న ఫోటోను షేర్ చేసింది. దీనికి What do you think of this look? అంటూ ప్రశ్నిస్తూ ఫైర్ మోజీని జోడించింది. ఈ హాట్ ఫొటోకు ఇప్పటికే 24లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
‘పాగల్ ’ బ్యూటీ నివేదా పేతురాజ్ డైమండ్ నెక్లస్ ధరించిన వీడియోను పోస్టు చేసింది. దీనికి Diamonds & Roses అనే మెసేజ్ ను జోడించింది. ఈ వీడియోకు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.
ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’లోని ‘పుష్ప.. పుష్పరాజ్’ అనే డైలాగ్ ను చెబుతున్న వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోకు ఐదు గంటల్లోనే రెండున్నర లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.