https://oktelugu.com/

Social Updates: అల్లు అరవింద్ కు విషెస్ చెప్పిన బన్నీ.. .శ్రియ కూతురు బర్త్ డే వీడియో..!

Social Updates: సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటారనే సంగతి అందరికీ తెల్సిందే. తమ రోజువారీ ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటూ సంబరపడుతున్నారు. ఈరోజు కూడా పలువురు స్టార్స్ సరికొత్త అప్ డేట్స్ పోస్టు చేసి అభిమానులను అలరించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి..! మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బర్త్ డే వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. అల్లు అరవింద్ కు ఆయన తనయుడు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 10, 2022 / 09:18 PM IST
    Follow us on

    Social Updates: సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటారనే సంగతి అందరికీ తెల్సిందే. తమ రోజువారీ ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటూ సంబరపడుతున్నారు. ఈరోజు కూడా పలువురు స్టార్స్ సరికొత్త అప్ డేట్స్ పోస్టు చేసి అభిమానులను అలరించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి..!

    మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బర్త్ డే వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. అల్లు అరవింద్ కు ఆయన తనయుడు పుష్పరాజ్(అల్లు అర్జున్) Happy Birthday Dad.. Lots n lots love always అంటూ ఓ పిక్ ను లవ్ సింబల్స్ తో షేర్ చేశాడు. ఈ ఫొటోలో అల్లు అరవింద్, బన్నీలు చిరునవ్వు చిందిస్తూ కన్పించారు. ఈ పోస్టుకు ఇప్పటికే 11లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.


    వెటరన్ బ్యూటీ శ్రియకు కూతురు పుట్టిన నేటికి ఏడాది గడుస్తుందని ఇన్ స్ట్రాలో ఒక వీడియోను పోస్టు చేసింది. తన కూతురు ఇదే రోజు ఉదయం 7:40నిమిషాలకు పుట్టిందని తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. శ్రియ పోస్టు చేసిన వీడియోకు ఇప్పటికే లక్షన్నరకు లైక్స్ వచ్చాయి.


    గుడ్ మార్నింగ్ మాల్దీవ్స్ పేరిట సన్నిలియోన్ ఫొటో షూట్ కు సంబంధించిన పిక్స్ ను ఇన్ స్ట్రా పోస్టు చేసింది. సన్నిలియోన్ హాట్ హాట్ ఫొటోలకు ఇప్పటికే ఎనిమిదిన్నర లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.


    ‘హుషారు’ ఫ్రేం ప్రియా వడ్లమాని గతేడాది తనకు నచ్చిన వీడియో ఇదేనంటూ ఓ వీడియోను పోస్టు చేసింది. మానాలిలోని ఓ రెస్టారెంట్లో ఆహారం తింటూ ప్రియా కన్పించింది.