KCR vs BJP: తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో జాతీయ స్థాయిలో బీజేపీ, రాష్ర్టంలో టీఆర్ఎస్ తమ పట్టు కోసం శ్రమిస్తున్నాయి. కేసీఆర్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో బీజేపీ, కేంద్రంలో బీజేపీని అదికారంలోకి రానీయొద్దనే ఆలోచనలో కేసీఆర్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల్లో వైరం పెరుగుతోంది. ఎవరి వ్యూహ ప్రతివ్యూహాల్లో వారు నిమగ్నమయ్యారు. దీంతో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇన్నాళ్లు ఇంతగా లేకున్నా ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.

తెలంగాణలో మరోసారి విజయం సాధించి కేటీఆర్ ను సీఎంను చేసి తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నట్లు గతంలోనే పలు వార్తలు ప్రచారం చేశాయి. కానీ కాలం కలిసిరాకపోవడంతో కేసీఆర్ తన ఆలోచనను వాయిదా వేసుకున్నారు. ఇదే సరైన సమయంగా భావించిన ఆయన టీఆర్ఎస్ ను రాష్ర్టంలో మరోమారు అధికారంలోకి తీసుకొచ్చి తన కొడుకుకు పట్టాభిషేకం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ముందే పసిగట్టిన కేంద్రం కూడా అంతే స్థాయిలో స్పందిస్తోంది. కేసీఆర్ వ్యూహాలను దెబ్బకొట్టాలనే భావనతోనే రాష్ర్టంలో ప్రత్యామ్నాయ శక్తిగి ఎదగాలని చూస్తోన్నట్లు సమాచారం.
Also Read: Social Updates: అల్లు అరవింద్ కు విషెస్ చెప్పిన బన్నీ.. .శ్రియ కూతురు బర్త్ డే వీడియో..!
ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాష్ర్టంలోనే చక్రం తిప్పాలని చూస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ కుట్రలను సాగనీయకుండా చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ స్టేట్ల సీఎంలను రాష్ర్టంలో పర్యటించేలా ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు గాను పటిష్ట యంత్రాంగాన్నే తయారు చేస్తోంది. తెలంగాణలో నువ్వా నేనా అన్న రీతిలో రాజకీయం నడిచేలా వ్యూహాలు పన్నుతోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. నేతలు ఎలా వ్యవహరించాలనే దానిపై ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ను ఎలా అణచాలనే దానిపై మళ్లగుల్లాలు పడుతున్నారు. బీజేపీని నిలువరించాలనే కేసీఆర్ యత్నాలను అడ్డుకోవాలని భావిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ దాన్ని అధికారంలోకి రానీయకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో బీజేపీని ఒకమారు అధికారంలో నిలబెట్టాలని తాపత్రయపడుతున్నారు. దీంతో దక్షిణాది ప్రాంతాల్లో కూడా బీజేపీకి పట్టు సాధించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి నేతలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Also Read: బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తే కేసీఆర్ తో మైత్రి?
[…] […]