
Sreemukhi: శ్రీముఖి టైం మాములుగా లేదు. అటు బుల్లితెరను ఇటు వెండితెరను షేక్ చేస్తుంది. టాప్ హీరోల చిత్రాల్లో శ్రీముఖి కీలక రోల్స్ దక్కించుకుంటున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి క్రేజీ రోల్ చేస్తున్నారట. చిరంజీవితో ఆమె ఖుషి చిత్రంలోని ఐకానిక్ నడుము చూసే రొమాంటిక్ సీన్ స్పూఫ్ చేశారట. పవన్-భూమిక చేసిన ఆ సన్నివేశాన్ని భోళా శంకర్ లో శ్రీముఖి, చిరంజీవిల మీద ఫన్నీగా రూపొందించారట.

అలాగే బాలయ్య మూవీలో కూడా ఆమె ఆఫర్ పట్టేసినట్లు తాజా సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్య 108వ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కి సిద్ధమైంది. ఈ మూవీలో శ్రీముఖి కీలక రోల్ చేశారట. శ్రీలీల ఓ ప్రధాన పాత్ర చేస్తుండగా శ్రీముఖి ఆమె ఫ్రెండ్ గా కనిపిస్తారని సమాచారం.

మరోవైపు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ శ్రీముఖితో వెబ్ సిరీస్లు, సినిమాలు ప్లాన్ చేస్తున్నాయట. అమెజాన్ ప్రైమ్, జీ 5 వేదికగా శ్రీముఖి నుండి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రానున్నాయనేది విశ్వసనీయ సమాచారం. ఆల్రెడీ శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. అయితే హీరోయిన్ గా శ్రీముఖికి అవకాశం దక్కింది.
ఇక శ్రీముఖి గ్లామర్ షోలో హద్దులు దాటేస్తుంది. తెలుగు యాంకర్ కాస్తా బోల్డ్ లేడీగా మారిపోయింది. షార్ట్ ఫ్రాక్ లో టూ మచ్ హాట్ గా ఉన్న శ్రీముఖి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఆహాలో ప్రసారమైన డాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి పింక్ కలర్ షార్ట్ ఫ్రాక్ ధరించి స్కిన్ షో చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. శ్రీముఖి పరువాలను ఆ చిన్న గౌను దాచలేక ఇబ్బంది పడిందంటే నమ్మాల్సిందే.

మరోవైపు శ్రీముఖి పెళ్లి రూమర్స్ తరచుగా చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను శ్రీముఖి ఖండించారు. రూమర్స్ సంగతి పక్కన పెడితే ఆమె టాప్ యాంకర్ గా అవతరించారు. అరడజను షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. శ్రీముఖి ఫేమ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది.